Ind vs Eng 2nd Semifinal Highlights | T20 World Cup 2026 సెమీస్ లో ఇంగ్లండ్ పై భారత్ విక్టరీ | ABP Desam

 T20 World Cup 2026 ను ముద్దాడేందుకు భారత్ ఆఖరి అడుగుకు విజయవంతంగా చేరుకుంది. ముంబై వాంఖడే వేదికగా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ కాస్తా హై స్కోర్ థ్రిల్లర్ గా మారిపోవటంతో...ఇరు జట్లూ విజయం కోసం తీవ్రంగా శ్రమించాయి. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ధైర్యంగా బౌలింగ్ తీసుకోగా...భారత బ్యాటర్లు చెలరేగిపోయారు. యథావిధిగా పులి అభిషేక్ శర్మ సెమీ ఫైనల్లోనూ విఫలమవగా...ఇషాన్ కిషన్ తోడుగా వెస్టిండీస్ మ్యాచ్ లో హీరో  సంజూశాంసన్...ఇంగ్లండ్ పైన సెమీస్ లోనూ విరుచుకుపడ్డాడు. అలవోకగా సిక్సర్లు, ఫోర్లు బాదుతూ స్కోరు బోర్డును ఇద్దరూ పరుగులు పెట్టించారు. ఇషాన్ 39 పరుగులు చేసి అవుటైనా తర్వాత వచ్చిన శివమ్ దూబే కూడా శివాలెత్తాడు. 25 బాల్స్ లో ఓ ఫోర్, 4 సిక్సర్లతో 43పరుగులు చేసి...పాండ్యా పొరపాటు కారణంగా రనౌట్ అయ్యాడు దూబే. పాండ్యా, తిలక్ చెరో 20ప్లస్ స్కోర్లతో మంచి క్యామియోనే ఇచ్చారు. ఇక హీరో సంజూ శాంసన్ పద్ధతిగా చెలరేగిపోయాడు. 42 బాల్స్ ఆడి 8 ఫోర్లు 7 సిక్సర్లతో 89 పరుగులు చేసి విల్ జాక్స్ బౌలింగ్ లో ఔటయ్యాడు. సంజూ దూకుడుతో భారత్ ఏకంగా 254 పరుగుల టార్గెట్ ఇవ్వగలిగింది  టీమిండియా. అయితే ఇంగ్లండ్ అంత తేలిగ్గా ఏం వదిలిపెట్టలేదు మనల్ని. ఓవైపు వికెట్లు పడుతున్నా బాజ్ బాల్ గేమ్ ను ప్లే చేస్తూనే ఉంది ఇంగ్లండ్. దొరికిన బౌలర్ ను దొరికినట్లు బాది పారేస్తూ రిక్వైర్డ్ రన్ రేట్ ను కరిగిస్తూ వచ్చారు. ప్రత్యేకించి యంగ్ స్టర్, 22 ఏళ్ల కుర్రాడు జాకబ్ బెత్ హెల్ చేసిన కళాత్మక విధ్వంస గురించి మాట్లాడుకోవాలి. ఆడుతోంది టీమిండియా లాంటి పెద్ద జట్టనే భయం లేకుండా...అపోజిట్ లో బుమ్రా లాంటి లెజండరీ బౌలర్స్ ఉన్నారనే బెరుకు లేకుండా విరుచుకుపడ్డాడు. విల్ జాక్స్ తోడుగా ఆల్మోస్ట్ మ్యాచ్ ను గెలిపించేస్తాడా అనేంత రేంజ్ లో ఆడి...ఛేజింగ్ లో మెరుపు సెంచరీ బాదేశాడు. 48 బాల్స్ లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 105 పరుగులు బాదిన బెత్ హెల్ ను భారత్ ఔట్ చేయటంతోనే మ్యాచ్ మన వైపు తిరిగింది. ఫలితంగా ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 246 పరుగులు చేయగా...భారత్ 7వికెట్ల తేడాతో గెలిచి న్యూజిలాండ్ తో 8వ తారీఖు జరగనున్న వరల్డ్ కప్ ఫైనల్ కి దూసుకెళ్లింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola