Jasprit Bumrah Bowling | T20 World Cup 2024 లో పరుగులు ఇవ్వకుండా బ్యాటర్లను ఏడిపిస్తున్న బుమ్రా
అది కాదండీ మాములుగా టీ20 అంటేనే బ్యాటర్ల జాతర. పోనీ ఎంత వెస్టిండీస్, అమెరికా పిచ్ లైనా ఎంతో కొంత కనీసంలో కనీసం కొడతారు కదా. కానీ మన బూమ్ బూమ్ బుమ్రా ఏంటంండీ పరుగులు ఇవ్వమంటే పిసినారి లా ప్రవర్తిస్తున్నాడు. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి అంతా 30-40 పరుగులు సమర్పించేసుకుంటున్న చోట బుమ్రా 10 పరుగులు ఇవ్వమంటేనే నానా బాధ పడిపోతున్నాడు. ఓ సారి ఈ లిస్ట్ చూడండి బుమ్రా గత నాలుగు ఐదు మ్యాచుల ప్రదర్శన. ఐర్లాండ్ మీద ఆరుపరుగులు ఇచ్చి రెండు వికెట్లు, పాకిస్థాన్ మీద 14పరుగులు ఇచ్చి 3వికెట్లు, ఆఫ్గానిస్తాన్ మీద 7పరుగులు ఇచ్చి 3వికెట్లు, మళ్లీ నిన్న బంగ్లాదేశ్ మీద 13పరుగులు ఇచ్చి రెండు వికెట్లు. ఏదో చిన్న టీమ్స్ కదా వేసేస్తున్నాడేమో అనుకోవటానికి వీలు లేదు. ఎందుకంటే అసలు బ్యాటర్ కు బంతే దొరకని లైన్ అండ్ లెంగ్త్ ను మెయింటైన్ చేస్తున్నాడు బుమ్రా. పరుగులు ఆపేస్తూ బ్యాటర్ మీద ఒత్తిడి పెంచేస్తున్నాడు..ఫలితంగా వికెట్లు దొరకబుచ్చుకుంటున్నాడు. టీ20ల్లో ఈ ఫార్మూలా అసాధ్యం. కానీ పాండ్యా సాధ్యం చేసి చూపిస్తున్నాడు. ఈ లిస్ట్ చూడండి. ఈ టీ20 వరల్డ్ కప్ లో అత్యధిక వికెట్లు తీసిన వీరు జాబితా...దీంట్లో చూడండి ఈ వరల్డ్ కప్ లో ఇప్పటివరకూ 10వికెట్లు తీసిన బుమ్రా ఇచ్చింది కేవలం 65పరుగులు..మిగిలిన బౌలర్లు చూడండి ఎన్ని రన్స్ ఇచ్చారో. ఎకానమీ చూడండి జస్ట్ 3.42. టెస్టు మ్యాచుల్లో ఆడే బౌలర్ల ఎకానమీ ఇది. దాన్ని టీ20 క్రికెట్ లో సాధ్యం చూపిస్తున్నాడు బుమ్రా. ఓవరాల్ కెరీర్ లోనూ బుమ్రా టీ20 బౌలింగ్ ఎకానమీ 6.31 మాత్రమే. ఇది కూడా అరుదు. అలా అటు పరుగులు ఇవ్వకుండా ఇటూ వికెట్లు తీస్తూ తన కొట్టే మొనగాడే లేడన్నట్లు ఈ టీ20 వరల్డ్ కప్ లో బుమ్రా బౌలింగ్ అయితే భారత్ కు విజయాలను తీసుకువస్తోంది. టీమిడింయా ను సెమీస్ కు చేరువచేసింది.