Afg vs Aus Super8 Match Highlights | T20 World Cup 2024లో ఆస్ట్రేలియాపై ఆఫ్గనిస్తాన్ పెను సంచలనం

Continues below advertisement

 ఈ రేంజ్ లో ఆఫ్గనిస్తాన్ రివెంజ్ ప్లాన్ చేసుకుంటుదని అస్సలు ఎవరూ ఊహించి కూడా ఉండరు. 2023 వరల్డ్ కప్ లో ఏ విజయాన్ని అయితే ఆఫ్గాన్ చేతిలో నుంచి భీకర డబుల్ సెంచరీతో ఆస్ట్రేలియా వైపు లాగేశాడో అదే ఆస్ట్రేలియాను ఏడాది గ్యాప్ లో చావగొట్టి చెవులు మూసింది ఆఫ్గనిస్థాన్. ఈ క్రేజీ మ్యాచ్ లో అసలు ఆఫ్గాన్ ఎలా గెలిచిందంటే ముందు ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కి దిగిన ఆఫ్గాన్ ఓపెనర్లు ఆడుతోంది ఆస్ట్రేలియా మీదే కాదన్నట్లు చాలా కాన్ఫిడెంట్ గా ఆడేశారు. గుర్భాజ్ 60పరుగులతో, జాద్రాన్ 51పరుగులతో ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. 118పరుగులకు ఆఫ్గాన్ తొలివికెట్ పడింది. కానీ ఆ తర్వాత బ్యాటర్లు పెద్దగా నిలవలేకపోవటంతో అనూహ్యంగా 148పరుగులే చేయగలిగింది ఆఫ్గానిస్థాన్. ఈజీ టార్గెట్టేగా కొట్టేద్దామనుకున్నారేమో ఆస్ట్రేలియా వాళ్లు...కాబూలీ బౌలర్లు రక్తకన్నీరు పెట్టించేశారు కంగారూలతో. మొదటి ఓవర్ లోనే ట్రావియస్ హెడ్ డకౌట్. వార్నర్ మావ 3పరుగుల అవుట్. మిచ్ మార్ష్ 12పరుగులు ఔట్. 32 పరుగులకే 3వికెట్లు కోల్పోయింది ఆఫ్గాన్. మళ్లీ వాడే ఆ మ్యాక్స్ వెల్లే అడ్డుపడ్డాడు ఆఫ్గాన్. ఏ తమ్ముళ్లూ డబుల్ సెంచరీ మర్చిపోయారా అన్నట్లు నవ్వుతూ హాఫ్ సెంచరీ కొట్టేశాడు మ్యాక్సీ. అయితే ఆఫ్గాన్ బౌలర్లు మరో ఎండ్ లో ఒక్కో వికెట్టూ లేపుతూ వచ్చేశారు. స్టాయినిస్, టిమ్ డేవిడ్, మ్యాధ్యు వేడ్ ఒక్కో వికెట్ కళ్ల ముందే పడుతుంటే ఆఫ్గాన్ శిబిరంలో ఆనందం చూడాలి. వావ్ ప్రతీ ఒక్క క్రికెట్ అభిమాని చూడాల్సిన మ్యాచ్ ఇది. పరుగులు పోకుండా ప్రాణాలు పెట్టేసి ఆడారు ఆఫ్గాన్ ఆటగాళ్లు.  గుల్బద్దీన్ నయిబ్ 4ఓవర్లలో 20పరుగులే ఇచ్చి 4వికెట్లు తన కెరీర్ లో సంచలన ప్రదర్శన చేశాడు. నవీన్ ఉల్ హక్ కూడా అంతే 4ఓవర్లు 20పరుగులు 3వికెట్లు.   అందరి కష్టం ఫలించి 21పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది ఆఫ్గనిస్థాన్.ఆస్ట్రేలియాపై ఆఫ్గన్ కి ఇదే తొలి విజయం కాగా..సూపర్ 8 గ్రూప్ A లో జరిగిన ఈ మ్యాచ్ లో గెలవటం ద్వారా నిజంగా ఆస్ట్రేలియా కొంపలు తేలగొట్టేసింది ఆఫ్గనిస్థాన్. ఎందుకంటే ఇప్పుడు నెక్ట్స్ మ్యాచ్ ఆఫ్గనిస్థాన్ కి బంగ్లాదేశ్ తో. ఆస్ట్రేలియాకు ఇండియాతో. ఇప్పుడున్న కాన్ఫిడెన్స్ కి ఆఫ్గాన్ కి బంగ్లా పై విక్టరీ జుజుబీ. సేమ్ టైమ్ లో ఆస్ట్రేలియా కనుక ఇండియా చేతిలో ఓడితే...సూపర్ 8 దశలోనే వన్డే వరల్డ్ ఛాంపియన్స్ టోర్నీ నుంచి నిష్క్రిమించాల్సి ఉంటుంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram