Ind vs Ban Super 8 Match Highlights | బంగ్లాదేశ్ పై 50పరుగుల తేడాతో భారత్ జయభేరి | ABP Desam

Continues below advertisement

 టీ20 వరల్డ్ కప్ లీగ్ దశలో పాకిస్థాన్ ను ఇంటిదారి పట్టేలా చేసిన భారత్...నిన్న ఒకప్పటి ఈస్ట్ పాకిస్థాన్  అదేనండీ బంగ్లాదేశ్ ను కూడా ఇంటి దారి పట్టేలా చేశారు మన టీమిండియా హీరోలు. వెస్టిండీస్ లోని ఆంటిగ్వా ఐలాండ్ లో జరిగిన టీ20 వరల్డ్ సూపర్ 8 గ్రూప్ A మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై 50 పరుగుల తేడాతో విక్టరీ కొట్టేసింది మన భారత్. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న బంగ్లాదేశ్ నిర్ణయం తప్పని తేలేలా మొదటి బంతి నుంచే భారత్ విరుచుకు పడింది. ప్రత్యేకించి ఈ వరల్డ్ కప్ లో ఇన్నాళ్లూ ఫెయిల్ అవుతూ వస్తున్న మన ఓపెనర్లు రోహిత్ శర్మ అండ్ విరాట్ కొహ్లీ నిన్న మ్యాచ్ లో అదరగొట్టేశారు. రోహిత్ 11 బాల్స్ లోనే 3ఫోర్లు 1సిక్సర్ తో 23పరుగులు చేస్తే..కింగ్ విరాట్ కొహ్లీ 28బంతుల్లో 1ఫోరు 3సిక్సర్లతో 37పరుగులు చేశారు. వీరిద్దరూ త్వరగానే అవుటైనా మ్యాచ్ కి కావాల్సిన ఇగ్నిషన్ ను అందించారు. ఆ తర్వాత వచ్చిన రిషభ్ పంత్ 36పరుగులను తన దైన స్టైల్ లో బాదేశాడు. అన్నింటికంటే హైలెట్ అంటే శివమ్ దూబే-హార్దిక్ పాండ్యా పార్టనర్ షిప్. ఈ సీజన్ లో ఇప్పటివరకూ బ్యాట్ ఝుళిపించిన దూబే నిన్న 3సిక్సులు బాది 34పరుగులు చేశాడు. కొంచెం స్లో ఇన్నింగ్స్ అయినా మునుపటి తో పోలిస్తే బెటర్ అనిపించింది. ఇక మన మైటీ ఆల్ రౌండర్ పాండ్యా అయితే హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. 27బాల్స్ లోనే 4ఫోర్లు 3సిక్సర్లతో సరిగ్గా 50పరుగులు చేయటంతో పాటు టీమిండియా స్కోరును 196పరుగులకు తీసుకువెళ్లటంతో పాండ్యాదే కీరోల్. ఇక 197పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ టాప్ ఆర్డర్ బాగానే ఆడింది. ముఖ్యమంగా లిటన్ దాస్, నజ్ముల్ శాంటో టీమిండియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొనే ప్రయత్నమైతే చేశారు. అయితే పాండ్యా లిటన్ దాస్ ను అవుట్ చేయటంతో మొదలైన పతనం ఇక ఆగలేదు. కుల్దీప్ యాదవ్, జస్ ప్రీత్ బుమ్రా బంగ్లా బౌలర్లను క్రష్ చేసేశారు. కుల్దీప్ 4ఓవర్లలో 19పరుగులే 3వికెట్లు తీస్తే..మన బూమ్ బూమ్ బుమ్రా 4ఓవర్లలో 13పరుగులే ఇచ్చి 2వికెట్లు తీసి తన పిసినారి తనాన్ని మరోసారి చాటుకున్నాడు. అర్ష్ దీప్ సింగ్ కూ రెండు వికెట్లు తీయటంతో బంగ్లాదేశ్ 8వికెట్ల నష్టానికి 146పరుగులే చేయగలిగింది. ఫలితంగా భారత్ 50పరుగుల విజయాన్ని అందుకోవటంతో పాటు టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ బెర్త్ ను దాదాపుగా కన్ఫర్మ్ చేసుకుంది. హార్దిక్ పాండ్యా బంగ్లాదేశ్ పైన మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram