Hardik Pandya All round Show | T20 World cup 2024 లో చెలరేగిపోతున్న హార్దిక్ పాండ్యా | ABP Desam
టైమ్..కాలం అన్నింటికి సమాధానం చెబుతుంది. రెండు నెలల క్రితం విలన్ లా ఉన్నవాడు ఇప్పుడు హీరో అయిపోయాడు. అతడే మన హార్దిక్ పాండ్యా. ఐపీఎల్ లో ఏ మూహుర్తాన ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ తీసుకున్నాడో కానీ అప్పటి నుంచీ పాండ్యాను దరిద్రం పట్టేసుకుంది. రోహిత్ శర్మను అవమానించాడని హిట్ మ్యాన్ ఫ్యాన్స్ తో పాటు మీడియా కూడా పాండ్యాపై దుమ్మెత్తిపోసింది. ఇదంతా మౌనంగా భరిస్తున్న టైమ్ లో పర్సనల్ గానూ పాండ్యాను ఇబ్బందులు చుట్టు ముట్టాయి. తన భార్య విడాకులు కోరుతోందంటూ వచ్చిన వార్తలు పాండ్యా కెరీర్ పై ప్రభావం చూపిస్తాయేమో అనిపించింది. కానీ కాదు. హార్దిక్ పాండ్యా టీ20 వరల్డ్ కప్ లో రెచ్చిపోతున్నాడు. అటు బౌలింగ్ లో అదరగొడుతున్న పాండ్యా ఇప్పుడు అవకాశం చిక్కినప్పుడల్లా బ్యాటింగ్ లో రఫ్పాడిస్తున్నాడు. ఈ వరల్డ్ కప్ లో పాండ్యా బ్యాటింగ్ చేసింది ఇప్పటివరకూ మూడుసార్లు మాత్రమే. మొదట పాకిస్థాన్ తో మ్యాచ్ లో 7పరుగులకే అవుటైనా ఆఫ్గానిస్థాన్ మ్యాచ్ లో 32పరుగులు, నిన్న బంగ్లా దేశ్ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ కొట్టాడు. టీమిండియా నిన్న 196పరుగుల భారీ స్కోరు చేయగలిగింది అంటే కారణం పాండ్యానే. అందుకే నిన్న బంగ్లాదేశ్ విక్టరీ తర్వాత మ్యాన్ ఆఫ్ ది మ్యాచూ అందుకున్నాడు. ఫినిషరైన పాండ్యా కు బ్యాటింగ్ వచ్చింది అంటే టీమిండియా టాప్ అండ్ మిడిల్ ఆర్డర్ కుప్పకూలాయని అర్థం. అలాంటి క్రూషియల్ టైమ్స్ లో పాండ్యా వరుసగా ఈ రెండు మ్యాచుల్లో చేసిన పరుగులు భారత్ విజయానికి కారణమయ్యాయి. మరో వైపు బౌలింగ్ లో నూ పాండ్యా రాణి్స్తున్నాడు. నిన్న బంగ్లా దేశ్ తో మ్యాచ్ లో తంజిద్ హసన్, లిటన్ దాస్ చాలా కాన్ఫిడెంట్ గా ఆడుతుంటే లిటన్ దాస్ ను అవుట్ చేసి భారత్ కు తొలివికెట్ ను అిందించింది పాండ్యానే. ఇవే కాదు ఐర్లాండ్ మీద మూడువికెట్లు, పాకిస్థాన్, యూఎస్ఏ మ్యాచుల్లో రెండేసి వికెట్లు తీశాడు పాండ్యా. ఈ వరల్డ్ కప్ లో ఇప్పటివరకూ 5మ్యాచుల్లో 8వికెట్లు తీసి తన ఆల్ రౌండర్ పాత్రకు న్యాయం చేస్తున్నాడు. అలా అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో ఇరగదీస్తూ కుంగ్ ఫూ పాండ్యా ఈజ్ బ్యాక్ అనిపిస్తున్నాడు.