IPL 2026 DC VS LSG Highlights | ఆల్ రౌండ్ షోతో బోణీ కొట్టిన ఢిల్లీ | ABP Desam

ఐపీఎల్ 2026లో ఢిల్లీ కేపిట‌ల్స్ బోణీ కొట్టింది. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో 6 వికెట్ల‌తో ఘ‌న‌విజ‌యం సాధించింది. టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన ల‌క్నో..18.4 ఓవ‌ర్ల‌లో 141 ప‌రుగుల‌కు ఆలౌటైంది. మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ అబ్దుల్ స‌మ‌ద్ 36 పరుగులు చేసి టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. బౌల‌ర్ల‌లో లుంగీ ఎంగిడి, న‌ట‌రాజ‌న్ మూడేసి వికెట్ల‌తో స‌త్తా చాటారు. 

అనంతరం ఛేజింగ్ ను 17.1 ఓవ‌ర్ల‌లోనే  4 వికెట్లకు 145 ప‌రుగులు చేసి పూర్తి చేసింది ఢిల్లీ. ఇంపాక్ట్ ప్లేయ‌ర్ గా వ‌చ్చిన స‌మీర్ రిజ్వి సూప‌ర్బ్ ఫిఫ్టీ తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. ట్రిస్ట‌న్ స్ట‌బ్స్ తో క‌లిసి కీల‌క స‌మ‌యంలో 119 రన్స్ కిపైగా ప‌రుగుల భాగ‌స్వామ్యంతో జ‌ట్టును విజ‌య‌తీరాల‌కు చేర్చాడు. బౌల‌ర్ల‌లో ప్రిన్స్ యాద‌వ్ కు రెండు వికెట్లు ద‌క్కాయి. 

అయితే చిన్న టార్గెట్ తోనే బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ త‌గిలింది. కేఎల్ రాహ‌ల్ ఇన్నింగ్స్ తొలి బంతికే డ‌కౌట‌య్యాడు. అక్ష‌ర్ ప‌టేల్ ను డ‌కౌట్ గా ప్రిన్స్ యాద‌వ్ ఔట్ చేశాడు. దీంతో 26 ప‌రుగుల‌కే నాలుగు కీల‌క‌మైన వికెట్లు కోల్పోయి, ఢిల్లీ పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. అప్పుడు వచ్చిన స‌మీర్ రిజ్వీ స్ట‌బ్స్ తో క‌లిసి కీల‌క భాగస్వామ్యం నెల‌కొల్పాడు. వీళ్లిద్దరు కలిసి ఆడడంతో ఢిల్లీ మ్యాచ్ ను సొంతం చేసుకుంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola