India vs Pakistan Match Preview | టీ20 వరల్డ్ కప్పులో ఈరోజు ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ | T20 WC 2024

 టీ20 వరల్డ్ కప్పులో ఈ రోజు ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్. న్యూయార్క్ లో ని నాసౌ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో గెలిస్తే భారత్ సూపర్ 8 ప్లేస్ కన్ఫర్మ్ అయిపోయినట్లే. అలాగే ఈ మ్యాచ్ లో ఓడిపోతే పాకిస్థాన్ ఇంటికి వెళ్లటం కూడా ఖాయమే. రీజన్ ఆల్రెడీ పాకిస్థాన్ అమెరికా చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది కాబట్టి. మరి ఇలాంటి మ్యాచ్ లో ఈ రోజు ఎవరు గెలుస్తారనే అభిమానులంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. భారత్ బ్యాటింగ్ కి ఎప్పట్లానే రోహిత్ శర్మ విరాట్ కొహ్లీ ఓపెనింగ్ ఇంపార్టెంట్ కాగా సేమ్ పాకిస్థాన్ కి బాబర్ అజమ్ మహమ్మద్ రిజ్వాన్ ఓపెనింగ్ బ్యాటింగే కీలకం. విరాట్ కొహ్లీ పాకిస్థాన్ పై అదిరిపోయే రికార్డుంది. పాకిస్థాన్ మీద టీ20ల్లో నాలుగుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడంటే అర్థం చేసుకోవచ్చు. 2022 టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ మీద ఛేజ్ చేసి కొహ్లీ కొట్టిన 82పరుగులు టీమిండియాను గెలిపించిన విధానం ఎవరైనా మర్చిపోగలరా. బాబర్ అండ్ రిజ్వాన్ ఇద్దరూ కూడా లెఫార్మ్ స్పిన్నర్లను ఎదుర్కోవటంలో ఇబ్బంది పడుతున్నారు సో టీమిండియా అక్షర్ పటేల్ స్థానంలో కుల్దీప్ యాదవ్ ను ఆడించే అవకాశం కనిపిస్తోంది. మిగిలిన టీమ్ అంతా ఐర్లాండ్ మీద ఆడిన జట్టే ఉండొచ్చు. పంత్, సూర్య కుమార్, సంజూ, దూబే, పాండ్యా బ్యాటింగ్ భారాన్ని పంచుకుంటారు. బుమ్రా,అర్ష్ దీప్, సిరాజ్ పేస్ అటాక్ ను జడ్డూ, అక్షర్ లేదా కుల్దీప్ స్పిన్ బాధ్యతలు చూసుకుంటారు. పాక్ బౌలింగ్ లో షహీన్ అఫ్రిదీ, మహమ్మద్ అమిర్, హారిస్ రవూఫ్ లను సమర్థంగా అడ్డుకుంటే చాలు..పాకిస్థాన్ పెషావర్ కి పార్సిల్ కావటం ఖాయం

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola