Netherlands vs South Africa Match Highlights | నెదర్లాండ్స్ పై అతి కష్టంగా నెగ్గిన సౌతాఫ్రికా | ABP
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆ ఏముందిలే చిన్న టీమే కదా నెగ్గేద్దాం అనుకుందేమో సౌతాఫ్రికా..చిన్న టార్గెట్ ఛేజ్ చేయటానికి అనుకోని రీతిలో అష్టకష్టాల్లో పడిపోయింది. మీ అందరికీ సౌతాఫ్రికా పెద్ద టీమ్ కావచ్చేమో కానీ ఐసీసీ టోర్నీల్లో మాకు ఆ టీమ్ ను వణికించటం అంటే భలే ఇష్టం అన్నట్లు మరోసారి నెదర్లాండ్స్ ఫియర్ సౌతాఫ్రికాకు ఫీవర్ తెప్పించింది. న్యూయార్క్ లో నాసౌ కౌంటీ స్టేడియంలోని జరిగిన టీ20 వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో సౌతాఫ్రికా నెదర్లాండ్స్ మీద అతి కష్టంగా గెలిచింది. తొలుత టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న సౌతాఫ్రికా నిర్ణయం సరైనదే అనిపించేలా..ఆ టీమ్ పేసర్లు నెదర్లాండ్స్ బ్యాటర్లను వణికించారు. మార్కో జాన్సన్, నోర్జే, బార్ట్ మన్ వణికించారు. ముఖ్యంగా బార్ట్ మన్ 4 ఓవర్లలో 11 పరుగులు మాత్రమే ఇచ్చి 4వికెట్లు తీసుకున్నాడు. అందులో మూడువికెట్లు లాస్ట్ ఓవర్లో తీశాడు. దీంతో నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 103పరుగులే చేసింది. 104పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా మహా అయితే 10 ఓవర్లలో ఈ టార్గెట్ ఛేజ్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ నెదర్లాండ్స్ అనుకోలేదు. ఇన్నింగ్స్ మొదటి బంతికే డికాక్ ను రనౌట్ చేయటం మొదలు సౌతాఫ్రికాను గజగజ వణికించారు.