India vs England Playing 11 | నేటి నుంచి ఇండియా ఇంగ్లాండ్ ఐదవ టెస్ట్ | ABP Desam

నేటి నుంచి ఇండియా ఇంగ్లాండ్ మధ్య ఐదవ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం అయ్యింది. ఇంగ్లండ్ టీం తమ ప్లేయింగ్ లెవెన్‌ను ప్రకటించింది. అయితే కెప్టెన్ బెన్ స్టోక్స్ జట్టు నుంచి అవుట్ అయ్యారు. ఓలీ పోప్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ప్లేయింగ్ లెవెన్‌లో స్టోక్స్ స్థానంలో యువ స్టార్ బ్యాట్స్‌మన్ జాకబ్ బెథెల్‌కు అవకాశం లభించింది. స్టోక్స్‌తోపాటు స్పిన్ ఆల్ రౌండర్ లియామ్ డాసన్ కూడా ఐదో టెస్ట్ నుంచి వైదొలిగాడు. ఇంగ్లండ్ ఈ టెస్ట్ మ్యాచ్ కోసం నలుగురు ఫాస్ట్ బౌలర్లను తమ ప్లేయింగ్ ఎలెవెన్‌లో చేర్చింది. ఒక్క స్పిన్నర్ కూడా లేకపోవడం కూడా ఆశ్చర్యకరం. అయితే ఇండియా మాత్రం ఈ మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది.

జోఫ్రా ఆర్చర్ కూడా ఐదో టెస్ట్ నుంచి దూరమయ్యాడు. అతని స్థానంలో జోష్ టంగ్ ప్లేయింగ్ ఎలెవెన్‌లో చేరాడు. ఇంగ్లండ్ ఈ సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉంది. సిరీస్‌ను కోల్పోకుండా ఉండాలంటే టీమ్ ఇండియా ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాలి, ఒకవేళ ఈ టెస్ట్ డ్రాగా ముగిసినా సిరీస్ ఇంగ్లీష్ జట్టుకే దక్కుతుంది. అయితే రీసెంట్ గా జరిగిన ప్రెస్ మీట్ లో తమ టీం ప్లేయింగ్ 11 గురించి మాట్లాడాడు బెన్ స్టోక్స్.ఈ మ్యాచ్ లో ఆడకపోవడం చాలా నిరాశగానే ఉంది. వైద్య బృందంతో చర్చల తర్వాత, ఈ నిర్ణయం తీసుకున్నారు. రిస్క్ చాలా ఎక్కువగా ఉంది. నా స్థానంలో మరెవరూ కూడా ఇలా రిస్క్ చేస్తారని నేను ఊహించలేదు," అని అంటున్నాడు స్టోక్స్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola