India vs England 5th Test Match Preview | ఇంగ్లాండ్ కు చావు దెబ్బ తప్పదా ? | ABP Desam

ఆఖరి టెస్టు మ్యాచ్ ఫ్యాన్స్ లో ఉత్కంఠ రేపింది. టీం ను ముందుగానే ప్రకటించిన ఇంగ్లాండ్ అందర్నీ షాక్ కు గురి చేసింది. కనీసం ఒక్క స్పిన్నర్‌ని కూడా తీసుకోలేదు. ఇప్పుడు ఇండియా ప్లేటింగ్ 11 పై అందరు ఆసక్తిగా ఎదురు చుస్తునారు. అయితే ఈ మ్యాచ్ లో బుమ్రా ఆడడం లేదని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. అన్షుల్ కాంబోజ్ అరంగేట్రంలోనే అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఒవెల్ పిచ్‌ పేస్ బౌలింగ్ అనుకూలిస్తుంది. సో అర్షదీప్ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తుంది. నాలుగో టెస్టుకు ముందు గాయపడిన ఆకాశ్ దీప్ ఐదో టెస్టులో అడుగుపెట్టనున్నాడు. 

మహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ఆకాశ్ దీప్ ముగ్గురు పేసర్లే ఇప్పుడు టీమిండియాలో యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. ఆల్‌రౌండర్ శార్థూల్ ఠాకూర్ ఉన్నప్పటికీ బౌలింగ్‌లో పూర్తిగా విఫలమవుతున్నాడు. కుల్దీప్ యాదవ్‌ను కూడా జట్టులోకి తీసుకోవాలని చూస్తున్నారట. అయితే ఇంగ్లాండ్ టీంలో కూడా ఎవరు ఊహించనట్టుగా మార్పులు చేసారు. మరి పిచ్ కు తగ్గట్టుగా ఇండియా టీం ఎలాంటి మార్పులు చేర్పులు చేస్తుందో చూడాలి. ఎలాగైనా ఆఖరి టెస్టులో విజయం సాధించి సిరీస్‌ను గెలవాలని భారత్ చూస్తుంటే... డ్రా చేసో సిరీస్‌ను సొంతం చేసుకోవాలని ఇంగ్లండ్ కూడా ప్రయత్నిస్తుంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola