Ind vs Pak | పాక్ జట్టులో అనుకోని సమస్య.. భారత్‌తో మ్యాచ్‌కు డౌటే | ABP Desam
పెహల్గామ్ ఎటాక్.. ఆపరేషన్ సింధూర్.. తర్వాత ఫస్ట్ టైం భారత్, పాకిస్తాన్ ఆసియా కప్ 2025 సీజన్‌లో తలపడబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ఇంకొన్ని గంటల్లో మొదలవుతుందనగా పాకిస్తాన్ టీమ్‌కి పెద్ద షాక్ తగిలింది. పాక్ టీం కెప్టెన్ సల్మాన్ అలీ అఘా ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతుండటం వల్ల ఈ మ్యాచ్ ఆడకపోవచ్చట. బుధవారం జరిగిన పాకిస్థాన్ ప్రాక్టీస్ సెషన్‌కి కూడా అఘా దూరంగా ఉన్నాడు. అఘా మెడ నొప్పితో బాధపడుతున్నాడని, దానివల్లే ప్రాక్టీస్‌కి రాలేదని పాకిస్థాన్ మీడియా పేర్కొంది. జట్టుతో కలిసి దుబాయ్‌లోని ఐసీసీ క్రికెట్ అకాడమీకి వచ్చినా కూడా.. మెడకు బ్యాండేజ్ వేసుకొనే కనిపించాడు. దాంతో అఘా టీమిండియాతో మ్యాచ్ ఆడే చాన్స్ లేనట్లు కనిపిస్తోంది. అయితే సల్మాన్ అలీ అఘాకు ఎలాంటి ఫిట్‌నెస్ సమస్యలు లేవని, అతని మెడ నొప్పి చిన్నదేనని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. పీసీబీ మీడియా మేనేజర్ చెప్పాడు. ముందస్తు జాగ్రత్తలో భాగంగానే అతను విశ్రాంతి తీసుకున్నాడని, భారత్‌తో జరిగే మ్యాచ్ మాత్రమే కాకుండా.. శుక్రవారం ఒమన్‌తో జరిగే మ్యాచ్‌లో కూడా అఘా బరిలోకి దిగుతాడని ఆయన చెప్పాడు. అయినా అఘా ఉన్నా.. లేకపోయినా.. ఇండియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోవడం తప్పదు కదా? ఏమంటారు.