Ind vs Ban Asia Fup 2025 Highlights | బంగ్లాదేశ్ ని చిత్తుగా ఓడించిన భారత్ | ABP Desam
ఆసియా కప్ 2025 టోర్నీలో టీమిండియా ఓటమనేదే లేకుండా దూసుకుపోతోంది. వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ విక్టరీ సాధించి గ్రాండ్ గా ఫైనల్ లో అడుగుపెట్టింది. బుధవారం జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 41 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ని తుక్కుతుక్కుగా ఓడించింది. ఈ గెలుపుతో మరో మ్యాచ్ మిగులుండగానే భారత్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. అయితే ఈ gelupuloy Abhishek Sharma గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి. అభిషేక్ మరోసారి రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. 37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 75 రన్స్ బాది హాఫ్ సెంచరీ to century వైపు దూసుకుపోతున్న టైంలో.. సూర్య అనవసర రన్ కి ట్రై చేయడంతో రన్ అవుట్ అయ్యాడు. అభిషేక్ ఔట్ అయ్యాక పాండ్య 38 తప్ప ఒక్కరూ కూడా పెద్దగా నిలదొక్కు కొలేకపోయారు. దీంతో మ్యాచ్ మొదలైనప్పుడు 200 మార్క్ అందుకుంటుందనుకున్న భారత్.. 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు మాత్రమే చేసింది. చేజింగ్ లో బంగ్లాదేశ్ పూర్తిగా చేతులెత్తేసింది. భారత్ బౌలర్ల ధాటికి 127 పరుగులకే ఆలౌటై ఓటమిపాలైంది. ఓపెనర్ సైఫ్ హసన్ 69 రన్స్ చేసి ఒంటరి పోరాటం చేసినా ఉపయోగం లేకపోయింది. ఇదిలావుంటే సూపర్ 4s లో శ్రీలంక ఇప్పటికే అఫిషియల్ గా టోర్నీ నుంచి ఔట్ కాగా.. భారత్ చేతిలో ఓటమితో బంగ్లాదేశ్ ఛాన్స్ లు కూడా కస్తమయ్యాయి. పాకిస్థాన్‌తో గురువారం జరిగే మ్యాచ్‌లో విజయం సాధిస్తేనే బంగ్లాదేశ్ కి ఫైనల్ బెర్త్ దక్కుతుంది. పాక్ గెలిస్తే పాక్ ఫైనల్ చేరుతుంది. అంటే మళ్లీ భారత్, పాక్ మ్యాచ్ తప్పేలా లేదన్నమాట.