ICC T20 Rankings: కొత్త టీ20 ర్యాంకులను ప్రకటించిన ఐసీసీ| ABPDesam|
కొత్త టీ20 ర్యాంకులను ప్రకటించిన ఐసీసీ. టీమ్ ర్యాంకుల్లో ఇంగ్లండ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.బ్యాటింగ్ ర్యాంకుల్లో పాకిస్థాన్ క్రికెటర్లు బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. బ్యాటింగ్ లో టాప్ 10 లిస్ట్ లో భారత్ నుంచి కేఎల్ రాహుల్ నాలుగో స్థానం లో, విరాట్ కోహ్లీ పదో స్థానంలో కొనసాగుతున్నారు. ఆల్‌రౌండర్ల లో అఫ్ఘనిస్తాన్ క్రికెటర్ మహ్మద్ నబీ అగ్రస్థానంలో ఉన్నారు. బౌలర్ల ర్యాంకుల్లో దక్షిణాఫ్రికా స్పిన్నర్ షాంసీ అగ్రస్థానం లో నిలిచాడు. టాప్-10 ఆల్‌రౌండర్లలోనూ టీమిండియాకు చెందిన క్రికెటర్లకు స్థానం దక్కలేదు.