Greatest T20 Player by AB de Villiers | బుమ్రానే ఆల్‌టైమ్ నంబర్ 1 | ABP Desam

టీ20 క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ప్లేయర్ ఎవరనే విషయాన్ని సౌతాఫ్రికా ప్లేయర్ మిస్టర్ 360, ఏబీ డివిలియర్స్ చెప్పుకొచ్చారు. విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ వంటి దిగ్గజ బ్యాటర్ల పేర్లు చెప్పకుండా, టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ టీ20 ప్లేయర్‌గా అభివర్ణించాడు. "కొత్త బంతి అయినా, పాత బంతి అయినా, చివరకు సూపర్ ఓవర్ అయినా.. బుమ్రా చేతికి బాల్ ఇస్తే మ్యాచ్‌ను గెలిపించి తీరుతాడు" అని ఏబీడీ చెప్పాడు. 

2013లో అరంగేట్రం చేసిన ఈ స్పీడ్‌స్టర్, ఇప్పటివరకు 270 టీ20ల్లో 345 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున 121 వికెట్లతో రెండో స్థానంలో ఉండగా, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున 183 వికెట్లతో టాప్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఇదిలా ఉండగా, పాకిస్థాన్ మాజీ పేసర్ ఆకిబ్ జావేద్ బుమ్రాపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. బుమ్రాను ఉస్మాన్ తారిఖ్‌తో పోల్చడంపై అభిమానులు మండిపడుతున్నారు. ప్రపంచ స్థాయి పేసర్‌ను ఒక సాధారణ స్పిన్నర్‌తో పోల్చడమేంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola