Google Search Engine 25Years : 25సంవత్సరాలు పూర్తి చేసుకున్న గూగుల్ సెర్చ్ ఇంజిన్ | ABP Desam
మనకు ఏదైనా సందేహం వస్తే ఏం చేస్తాం. ఆన్ లైన్ లోకి వెళ్లి గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో వెతుకుతాం అంతేకదా. గూగుల్ తల్లి అని అందరూ ప్రేమగా పిలుచుకునే గూగుల్ సెర్చింజిన్ 1998లో ప్రారంభమై పాతికసంవత్సరాలను పూర్తి చేసుకుంది. మరి ఈ పాతికేళ్లలో తన సెర్చ్ ఇంజిన్ లో ఎక్కువ మంది నెటిజన్లు వెతికిన టాపిక్స్ ఏంటో ప్రకటించింది గూగుల్.