Eng vs Ind First Test England First Innings All Out | మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ ఆలౌట్..భారత్ కు స్వల్ప ఆధిక్యం | ABP Desam
ఎట్టకేలకు ఇంగ్లండ్ ఆలౌట్ అయ్యింది. రోజున్నర భారత బౌలర్లు చచ్చీ చెడీ శ్రమించి మొత్తానికి ఇంగ్లండ్ ను అయితే ఆలౌట్ చేశారు. భారత బౌలర్లను ఇంగ్లండ్ సమర్థంగా ఎదుర్కోవటంతో పాటు అందరో తలో చేయి వేయటంతో ఇంగ్లండ్ 465 పరుగులకు ఆలౌట్ అయ్యి భారత్ కు జస్ట్ 6 పరుగుల ఆధిక్యాన్ని ఇచ్చింది. మనోళ్లు ఫస్ట్ ఇన్నింగ్ లో జైశ్వాల్, గిల్, పంత్ సెంచరీలు బాదితే..ఇంగ్లండ్ లో మాత్రం ఓలీ పోప్ ను మాత్రమే సెంచరీ చేయనిచ్చారు మన బౌలర్లు అది కాస్త సానుకూలాంశం అని చెప్పాలి. మరీ ముఖ్యంగా హ్యారీ బ్రూక్ 99పరుగులకు ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ లో ఔటయ్యాడు పాపం. ఓలీ పోప్ ఒక్కడే సెంచరీ బాది 106పరుగులు చేసి ఔట్ అయ్యాడు. రెండో సెషన్ ప్రారంభమయ్యే టైమ్ కి ఇంగ్లండ్ 5వికెట్ల నష్టానికి 327పరుగులతో ఉండగా ..మరో 138 పరుగులు ఇచ్చి సింగిల్ సెషన్ లో మన బౌలర్లు మిగిలిన ఐదు వికెట్లు తీయగలిగారు.మనోళ్ల చెత్త ఫీల్డింగ్ కారణంగా ఎన్నో క్యాచ్ లు వదిలేసినా బుమ్రా మాత్రం ఒంటి చేత్తో బౌలింగ్ దళాన్ని లీడ్ చేశాడు. చివర్లో టంగ్ ను తన దైన శైలిలో క్లీన్ బౌల్డ్ చేసి 5వికెట్ల ఘనతను సాధించాడు. మొత్తంగా భారత బౌలర్లలో బుమ్రా 5 వికెట్లతో పాటు..ప్రసిద్ధ్ కృష్ణ 3, సిరాజ్ 2 వికెట్లు తీసుకున్నారు. పడిన వికెట్లన్నీ పేసర్లకే పడ్డాయి. ఇప్పటికే మూడు రోజులు ఆల్మోస్ట్ ముగిసిపోయాయి. ఈరోజు టీ తర్వాత భారత్ లాస్ట్ సెషన్ ఎలా ఆడుతుంది..రేపు రెండు రోజులు ఏ టీమ్ ఎలా నిలబడుతుంది అన్నదాన్ని బట్టి అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో స్కోర్ థ్రిల్లర్ లు అవుతాయి లేదంటే మొదటి టెస్టు డ్రా గా ముగిసే అవకాశం ఉంటుంది.