Eng vs Ind First Test 1st Innings Highlights | మొదటి ఇన్నింగ్స్ లో 471పరుగులకు భారత్ ఆలౌట్ | ABP Desam
ఇంగ్లండ్ తో ప్రారంభమైన మొదటి టెస్టులో భారత్ మొదటి ఇన్నింగ్స్ లో భారీ స్కోరే చేసింది. స్పైడీ రిషభ్ పంత్ అటాకింగ్ గేమ్ తో సూపర్ సెంచరీ బాదటంతో భారీ స్కోరు సాగుతుందనుకున్న టీమిండియా అనూహ్యంగా 41పరుగులకే చివరి 7వికెట్లు కోల్పోయి మొదటి ఇన్నింగ్స్ లో 471 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఇన్నింగ్స్ ను ప్రారంభించిన కెప్టెన్ గిల్, వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ మొదటి గంట సేపు ఎలాంటి తప్పులు చేయకుండా స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ప్రత్యేకించి రిషభ్ పంత్ అటాకింగ్ షాట్స్ తో రెచ్చిపోయాడు. ఫలితంగా సూపర్ సిక్సర్ తో సెంచరీ కంప్లీట్ చేసుకుని తనదైన స్టైల్ లో పిల్లి మొగ్గల సెలబ్రేషన్ చేశాడు. అయితే 147పరుగులు చేసి కెప్టెన్ గిల్ అవుట్ అవటంతో భారత్ వికెట్ల పతనం మొదలైంది. 8ఏళ్ల తర్వాత టీమిండియాలో చోటు సంపాదించి ఎన్నో ఆశలు పెట్టుకున్న కరుణ్ నాయర్ డకౌట్ కాగా...పంత్ కూడా ధాటిగా ఆడే ప్రయత్నంలో 134పరుగులకు అవుట్ అవటంతో వికెట్ల పతనం ఆగలేదు. జడ్డూ, శార్దూల్ కూడా వికెట్ల పతనాన్ని ఆపలేకపోయారు. ఫలితంగా 41పరుగుల తేడాతో 7వికెట్లు కోల్పోయిన టీమిండియా 471పరుగులకు ఆలౌట్ అయ్యింది. రెండో రోజు అనూహ్యంగా రెచ్చిపోయిన ఇంగ్లండ్ బౌలర్లలో కెప్టెన్ బెన్ స్టోక్స్ నాలుగు వికెట్లు, జోష్ టంగ్ నాలుగు వికెట్లతో సత్తా చాటారు.