India vs England Test Preview | భారత్‌- ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ ప్రివ్యూ

Continues below advertisement

భారత్‌- ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ నేటి నుండి ప్రారంభం కానుంది. విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత జరిగే తోలి టెస్ట్ మ్యాచ్ కూడా ఇదే. అలాగే టీమిండియా టెస్టు టీంకు శుభ్‌మన్ గిల్ తొలిసారి సారథ్యం వహించనున్నాడు. ఈ టెస్ట్ సిరీస్ గెలవడమే నా లక్ష్యం అని అంటున్నాడు కొత్త కెప్టెన్ శుబ్మన్ గిల్. టెస్ట్ గెలవడానికి బ్యాటింగ్ ఆర్డర్‌ను కూడా మార్చడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పాడు శుబ్మన్ గిల్. లీడ్స్‌లోని హెడింగ్లీ క్రికెట్ స్టేడియం స్పిన్‌కు కాస్త అనుకూలంగా ఉండే ఛాన్స్‌ ఉందని అంటున్నారు క్రికెట్ నిపుణులు. దాంతో రవీంద్ర జడేజాతో పాటు కుల్దీప్ యాదవ్‌ను ఆడే అవకాశం ఉంది. అలాగే ఈ మ్యాచ్ లో జస్ప్రీత్ బుమ్రా కచ్చితంగా ఆడతానని ముందే చెప్పేసాడు. బుమ్రాతో పాటు మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ లేదా అర్ష్ దీప్ సింగ్ కి ప్లేయింగ్‌ 11 లో ఛాన్స్ దొరికే అవకాశం ఉంది. రాహుల్ ద్రవిడ్ సేన చరిత్ర సృష్టించిన 2007 తర్వాత ఇంగ్లాండ్‌లో భారత్ టెస్ట్ సిరీస్ గెలవలేదు. మరి గిల్ సారథ్యంలోని ఇండియా టీం ఈ రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా అన్నది తేలాల్సి ఉంది. పూర్తి స్థాయి పేస్ అటాక్, ఫామ్‌లో ఉన్న మిడిల్ ఆర్డర్‌తో...  సీనియర్లు లేకుండా ఈ యంగ్ టీం  ఎలా రాణిస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola