Eng vs Ind 3rd Test Day 2 Highlights | లార్డ్స్ టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో పోరాడుతున్న భారత్ | ABP Desam
ఇంగ్లండ్ జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో 1-1 తో ఉన్న భారత్ మూడోదైన లార్డ్స్ టెస్టులో పట్టుసాధిద్దామంటే ఇంగ్లండ్ అంత తేలిగ్గా లొంగట్లేదు. బుమ్రా 5 వికెట్ల ప్రదర్శనతో ఎట్టకేలకు ఇంగ్లండ్ జిడ్డు బ్యాటింగ్ కు తెరదింపిన టీమిండియా...ఫస్ట్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ప్రారంభించి రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఫర్వాలేదనిపించింది. ప్రధానంగా ఆర్చర్ నేతృత్వంలోని పేస్ దళాన్ని ఎదుర్కోవటం భారత్ బ్యాటర్లకు కష్టంగా మారుతోంది. ఆర్చర్, బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్ తలో వికెట్ పడగొట్టడంతో భారత్ రెండో రోజు ఆట ముగిసే టైమ్ కి 3 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. జైశ్వాల్ 13పరుగులు, సెకండ్ టెస్టులో డబుల్ సెంచరీ, సెంచరీ కొట్టిన కెప్టెన్ గిల్ 16 పరుగులు, నిలదొక్కుకుని బాగానే ఆడుతున్న టైమ్ లో కరుణ్ నాయర్ 40పరుగులకు అవుటయ్యారు. వికెట్లు పడుతున్నా టీమ్ భారాన్ని మోస్తూ మిస్టర్ డిపెండబుల్ కేఎల్ రాహుల్ 53పరుగులు చేశాడు. 113 బంతులను ఓపికగా ఎదుర్కొన్న కేఎల్ 5 ఫోర్లతో హాఫ్ సెంచరీ చేసి పోరాడుతున్నాడు. మరో వైపు వేలి గాయంతో కీపింగ్ కు రెండు రోజుల పాటు దూరమైన రిషభ్ పంత్ గాయం పూర్తిగా మానకుండానే బ్యాటింగ్ ను ప్రారంభించాడు. ఇబ్బంది పడుతున్నా సరే నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆట ముగిసే టైమ్ కి రాహుల్ 53 పరుగులు, పంత్ 19పరుగులతో ఉన్నారు. ఇక మిగిలిన బ్యాటర్లలో నితీశ్ కుమార్, సుందర్, జడేజా లాంటి ఆల్ రౌండర్లు ఉన్నా స్పెషలిస్ట్ బ్యాటర్లు లేకపోవటంతో రాహుల్, పంత్ మూడో రోజు ఎలా ఆడతారనే దానిపై లార్డ్స్ టెస్టులో భారత్ ఎలాంటి ఫలితం సాధించనుందో డిసైడ్ కానుంది. చూడాలి రాహుల్ అన్న కాపాడాతేడేమో లేదా పోరాట యోధుడు పంత్ తన పదును మరోసారి చూపిస్తాడేమో.