Ashwin Fire on Gambhir Decisions | డ్రెస్సింగ్ రూమ్ లో రన్నింగ్ రేస్ పెట్టడం కరెక్ట్ కాదు | ABP Desam

 న్యూజిలాండ్ తో జరుగుతున్న టీ20 సిరీస్ భారత బ్యాటర్లకు పరుగుల జాతర అని చెప్పాలి. ఎందుకంటే ఎప్పటి నుంచో ఫామ్ లో లేని కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ సహా దాదాపుగా బ్యాటర్లంతా ఫామ్ లోకి వచ్చేశారు. ముఖ్యంగా తిలక్ వర్మ ప్లేస్ లో చోటు దక్కించుకున్న ఇషాన్ కిషన్ పాకెట్ డైనమోలా పేలాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో ఇషాన్ ఆడిన ఇన్నింగ్స్ ఇప్పుడు సంజూ స్థానానికి ఎసరు పెట్టేలా ఉందని చర్చ నడుస్తోంది. బీభత్సమైన ఫామ్ లో ఉన్న తిలక్ వర్మ తిరిగి టీమ్ లోకి వస్తే...ఇషాన్ ఇదే ఫామ్ ను కంటిన్యూ చేస్తే న్యూజిలాండ్ తో రెండు టీ20 మ్యాచుల్లో తేలిపోయిన సంజూ శాంసన్ ను తప్పించి ఇషాన్ కిషన్ ను ఫస్ట్ ప్రిఫరెన్స్ కీపర్ గా తీసుకోవాలనేది అందరి నుంచి వినిపిస్తున్న డిమాండ్. బట్ ఈ మాటలపై మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ మండిపడ్డాడు. డ్రెస్సింగ్ రూమ్ నుంచి వినిపిస్తున్న ఈ టాక్ నిజమైతే గంభీర్ చేసే అతిపెద్ద సర్కస్ ఫీట్ ఇదే అవుతుందన్నాడు అశ్విన్. రెండు మ్యాచుల్లో సంజూ ఫెయిల్  అయినంత మాత్రాన తనకున్న సీనియార్టీని గతంలో అతను ఆడిన ఇన్నింగ్స్ లను మర్చిపోతే అంతకంటే దారుణం మరొకటి ఉండదన్నాడు అశ్విన్. ఇషాన్ ఆటను తను తక్కువ చేయట్లేదని కానీ రెండు మ్యాచుల ప్రదర్శనతో డ్రెస్సింగ్ రూమ్ లో ఇలా స్థానాల కోసం రన్నింగ్ రేస్ లు పెట్టడం గంభీర్ కి ఏమాత్రం మంచిది కాదని చీవాట్లు పెట్టాడు రవిచంద్రన్ అశ్విన్. ఇప్పుడు ఆడుతున్నాడని రేపు సంజూను పక్కనపెట్టి ఇషాన్ కిషన్ ను తీసుకుని అతను వరల్డ్ కప్ లో ఫెయిల్ అయితే రెస్పాన్సిబులిటీ ఎవరు తీసుకుంటారని ప్రశ్నించాడు అశ్విన్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola