Pakistan Pull out T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ నుంచి పాక్ తప్పుకునే అవకాశం | ABP Desam

Continues below advertisement

 టీ20 వరల్డ్ కప్ మొదలు కావటానికి ఇంక కొద్ది రోజులే సమయం ఉండగా...ఇప్పుడు బాయ్ కాట్ ట్రెండ్ మొదలైంది. ముస్తాఫిజుర్ ని ఐపీఎల్ నుంచి తప్పించారని కోపం తెచ్చుకున్న బంగ్లాదేశ్..ఏకంగా టీ20 వరల్డ్ కప్ ఆడమని మొండికేసి కూర్చుంది. భారత్ లో తమ మ్యాచ్ లు వేరే దేశానికి మార్చాలని లేదంటే మ్యాచ్ లు ఆడమని ఐసీసీని బంగ్లా క్రికెట్ బోర్డు బెదిరించటంతో...ఆడకపోతే పక్కకి పోవాయ్ అన్నట్లు ఐసీసీ బిహేవ్ చేసింది. అంతే కాదు బంగ్లా తప్పుకోవటంతో స్కాట్లాండ్ టీ20 వరల్డ్ కప్ ఆడుతోందని ఐసీసీ అధికారికంగా ప్రకటించేసింది కూడా. ఇదిలా ఉండే ఇప్పుడు పాకిస్తాన్ మేం కూడా టీ20 వరల్డ్ కప్ ఆడమని మొండికేస్తోంది. భారత్ తో జరిగే మ్యాచులకు శ్రీలంక ఆతిథ్యం వహిస్తున్నా..పాక్ ఆడకపోవటానికి కారణం ఏం లేకున్నా భారత్ ను ఇబ్బంది పెట్టాలని పాక్ ఆలోచిస్తుంది కాబోలు...బంగ్లాదేశ్ కి అన్యాయం జరిగింది..మేం భారత్ ఆధిపత్యాన్ని సహించం..మా ప్రభుత్వాన్ని పర్మిషన్ అడిగాం..వాళ్లు ఆడొద్దంటే వరల్డ్ కప్ కి మేం కూడా దూరం అని పీసీబీ ఛైర్మన్ నఖ్వీ మీడియాకు తెలిపారు. పాక్ ఆడకపోతే ఆడకపోయింది అన్నట్లు ఐసీసీ కూడా బ్యాకప్ ఆప్షన్స్ ను రెడీ చేసుకుంటోంది. పాకిస్తాన్ కనుక మేం ఆడమంటే దాని బదులుగా గ్రూప్ లో భారత్ తో తలపడే అవకాశాన్ని ఉగాండా అందుకోనుంది. పపువా న్యూ గినియా కంటే బెటర్ ర్యాంకింగ్ లో ఉండటంతో ఉగాండా కు వరల్డ్ కప్ ఆడే అవకాశం పాకిస్తాన్ కాదు అనుకుంటే దక్కనుంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola