Afghanistan T20 World Cup 2024 Semis | Home Ground కూడా లేని ఆఫ్గాన్ కు BCCI అండ | ABP Desam
ఆఫ్గానిస్థాన్ టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టి సంచలనమే సృష్టించింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి జట్లను అంత చిన్న టీమ్ అసలు ఎలా ఓడించిందంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. కానీ ఆఫ్గాన్ ఆటగాళ్లు అద్వితీయమైన ప్రతిభను గుర్తించి వాళ్లకు అండగా నిలిచింది మన బీసీసీఐ. అసోసియేట్ దేశాల్లో, చిన్న దేశాల్లో క్రికెట్ ను ప్రోత్సహించాల్సింది ఐసీసీనే అయినా అఫ్గాన్ క్రికెట్ కు సంబంధించి బాధ్యతలను బీసీసీఐ తీసుకుంది. తాలిబన్ల ప్రభుత్వంలో కఠినమైన ఆంక్షల మధ్య ఆఫ్గాన్ లో వాళ్లకు ఆడేందుకు ఒక్క ఇంటర్నేషనల్ స్టేడియం కూడా లేదు. మరి ప్రాక్టీస్ ఎలా. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి పెద్ద టీమ్స్ ను ఓడించాలంటే వసతులు కూడా ఉండాలి కదా. సరిగ్గా ఇక్కడే బీసీసీఐ ఆఫ్గాన్ క్రికెట్ బోర్డుకు సహాయం అందిస్తోంది. మన దేశంలో మూడు క్రికెట్ గ్రౌండ్స్ ను ఆఫ్గనిస్థాన్ కు కేటాయించింది బీసీసీఐ. గ్రేటర్ నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ పథిక్ స్టేడియం, లక్నోలోని ఎకానా స్టేడియం, ఇంకా డెహ్రాడూన్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియాలు 2015 నుంచి ఆఫ్గానిస్థాన్ కు హోమ్ గ్రౌండ్స్. వాళ్లు అక్కడే ప్రాక్టీస్ చేసుకుంటారు.