Afghanistan Performance in T20 World Cup 2024 | ఈ వరల్డ్ కప్ లో ఆఫ్గాన్ ఆట చూస్తే గూస్ బంప్స్ | ABP

ఒక న్యూజిలాండ్, ఒక ఆస్ట్రేలియా...ప్రపంచ క్రికెట్ లో టీమిండియా లాంటి స్ట్రాంగ్ టీమ్ కి కూడా ఇవి రెండు ప్రత్యర్థులుగా ఉన్నాయంటే ఎక్కడో తెలియని వణుకు. అది కూడా ప్రపంచకప్ లాంటి స్టేజ్ ల్లో ఈ టీమ్స్ మీద మ్యాచులంటే చాలు తెలియకుండానే టెన్షన్ మొదలవుతుంది. అలాంటిది ఆ రెండు టీమ్స్ ను టీ20 వరల్డ్ కప్స్ నుంచి నాకౌట్ అయ్యేలా చేసింది పనికూన ఆఫ్గనిస్థాన్. ఇకపై ఆఫ్గాన్ ని పసికూన అనలేమేమో కసి కూన అనాలి. లేదంటే న్యూజిలాండ్ బ్యాటింగ్ డెప్త్ ఉన్న టీమ్ ని 75పరుగులకు ఆలౌట్ చేయటం ఏంటీ...ఆస్ట్రేలియా లాంటి వరల్డ్ ఛాంపియన్ ను 140 పరుగులు కొట్టకుండా ఆపడం ఏంటీ..కాబూలీల బౌలింగ్, ఫీల్డింగ్ అయితే మైండ్ బ్లోయింగ్ అసలు. రషీద్ ఖాన్ అనే నాయకుడిని ముందు పెట్టుకుని  వరల్డ్ క్లాస్ ఆట ఆడేశారు. ఓసారి కొడితే గాలివాటం అనుకోవచ్చు. చెప్పి మరీ దిగ్గజాలను ఓడిస్తుంటే ఏమని చెప్పాలి ఆఫ్గానిస్థాన్ ఆట గురించి. ఇంకా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఆఫ్గానిస్థాన్ ఆట ఆడేందుకు వచ్చిన పరిస్థితుల గురించి మాట్లాడుకోవాలి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola