13 Years boy Vibhav Suryavanshi IPL Auction 2025 | టీనేజర్ ను వేలంలో కొన్న రాజస్థాన్ | ABP Desam

 ఐపీఎల్ మెగా వేలంలో సంచలనం నమోదైంది. ఓ 13ఏళ్ల వయస్సున్న పిల్లాడిని రాజస్థాన్ రాయల్స్ ఏకంగా కోటీ పదిలక్షల రూపాయలు వెచ్చించి కొనుక్కుంది. బిహార్ కు చెందిన వైభవ్ సూర్యవంశీ 12ఏళ్లకే ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడి సచిన్, యువరాజ్ సింగ్ ల అతి పిన్నవయస్సు ను రికార్డు బద్ధలు కొట్టి వార్తల్లో నిలిచాడు. 15ఏళ్లకు సచిన్, యువరాజ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడగా 12ఏళ్లకే సూర్యవంశీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ కు సెలెక్ట్ అయ్యాడు. వినూ మన్కడ్ ట్రోఫీలో ఐదు మ్యాచుల్లో 400పరుగులు చేసి ఔరా అనిపించిన వైభవ్ ను..ఏకంగా రంజీ టీమ్ కు సెలెక్ట్ చేయటంతో టీనేజ్ సంచలనంగా మారాడు. ఇప్పుడు ఐపీఎల్ వేలంలోనూ రిజిస్టర్ చేయించుకుని ఐపీఎల్ ఆడుతున్న అతి చిన్న వయస్కుడిగానూ సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు వైభవ్ రఘువంశీ. ఇతడిలో ఉన్న అపార ప్రతిభ కారణంగా రాజస్థాన్ భవిష్యత్ అవసరాలను తీరుస్తాడని అంచనా వేస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola