Aus vs Ind Perth Test Highlights | ఎలానో మొదలై....కంప్లీట్ డామినేషన్ తో ముగిసిన పెర్త్ టెస్ట్ | ABP
పెర్త్ టెస్టులో భారత్ ఘన విజయం. ఫస్ట్ ఇన్నింగ్స్ లో మన ఆటను చూసి కనీసం ఈ ఊహ కూడా ఎవ్వరికీ వచ్చి ఉండదు. బోర్డర్ గావాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలోనే ఓడిస్తే మనం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆడం. ఈ సంగతి టీమిండియా మొత్తానికి తెలుసు కానీ బ్యాడ్ లక్. టాస్ గెలిచి పెర్త్ టెస్టులో బ్యాటింగ్ తీసుకున్న కొత్త కెప్టెన్ బుమ్రాపై విమర్శలు మొదలయ్యాయి. పేస్ కు బీభత్సంగా అనుకూలించే పిచ్ పై బ్యాటింగ్ ఎలా తీసుకుంటావ్ అని. అనుకున్నట్లుగానే టీమిండియా మొదటి రోజే 150 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రాహుల్, పంత్ కి తోడు నితీశ్ రెడ్డి 41 పరుగులు చేయటంతో భారత్ ఆ స్కోరైనా చేయగలిగింది. ఇక ఆస్ట్రేలియా మనల్ని ఓ ఆటాడేసుకుంటుంది అనున్నారు అంతా. కానీ బూమ్ బూమ్ బుమ్రా ఉన్నాడుగా. మొదటి రోజే ఆసీస్ కు చుక్కలు చూపించాడు. బుమ్రా బుల్లెట్ల లాంటి బంతులకు 59పరుగులకే 7వికెట్లు కోల్పోయింది ఆసీస్. ఆ తర్వాత కోలుకోలేకపోయింది. 104పరుగులకే ఆసీస్ ఆలౌట్ అవటం మనోళ్లలో ఆత్మవిశ్వాసం నింపింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో భారత ఓపెనర్లు జైశ్వాల్, రాహుల్ ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. వికెట్ కోల్పోకుండా స్కోరు బోర్డుపై ఈ ఇద్దరూ కలిసి పెట్టిన 201పరుగుల భాగస్వామ్యం భారత్ ను టెస్టులో డ్రైవింగ్ సీట్ కు తీసుకెళ్లింది. కుర్రోడు యశస్వి జైశ్వాల్ అయితే చిచ్చరపిడుగులా చెలరేగిపోయాడు. ఆసీస్ పై ఆడిన మొదటి టెస్టులోనే 161పరుగులతో భారీ సెంచరీ కొట్టాడు. పోనీ అక్కడితో కథ అయిపోయిందా అంటే లేదు. కింగ్ కొహ్లీ విరుచుకపడి సెంచరీ బాది కెరీర్ లో81వ సెంచరీ చేశాడు. దీంతో భారత్ 534పరుగుల టార్గెట్ ఇచ్చింది ఆసీస్ కు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎప్పుడూ ఛేజ్ చేయని స్కోర్ అది. ఆ కాన్ఫిడెన్స్ బూమ్ బూమ్ మళ్లీ చెలరేగాడు 12 పరుగులకే 3వికెట్లు కోల్పోయింది ఆసీస్. తర్వాత రోజు హెడ్, మార్ష్, కేరీ పోరాడటంతో 238పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఆల్మోస్ట్ భయానక స్టేజ్ లో తొలి టెస్ట్ అనే బెరుకు లేకుండా మనల్ని ఆదుకున్న నితీశ్ రెడ్డి, ఆసీస్ లో మొదటి టెస్ట్ అయినా వెరవకుండా కంగారూ బౌలర్లను చెండాడిన జైశ్వాల్, తనలోని వింటేజ్ మాస్టర్ ను బయటకు తీసి రన్ మెషీన్ ను మళ్లీ చూపించిన కొహ్లీ...మాములుగానే డేంజరస్ బౌలరని ఇక కెప్టెన్ అయితే ఎంత బాధ్యతగా ఉంటానో చూసుకో అన్నట్లు టెస్టు మ్యాచ్ లో 8వికెట్లు తీసిన బుమ్రా..అప్స్ అండ్ డౌన్స్..అన్నీ కలిపి నిజంగా భారత్ పెర్త్ లో సాధించిన విక్టరీ అబ్యల్యూట్ దిస్ ఈజ్ సినిమా కంటెంట్.