Chinnaswamy Stadium Relocation | కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం
చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేసింది. ఇప్పుడు ఈ విషయంలో కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ స్టేడియాన్ని మరో ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తోంది కర్ణాటక ప్రభుత్వం.
బెంగళూరు క్రికెట్ స్టేడియాన్ని మార్చడంపై ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తోందని అన్నారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య . ఈ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం కోసం ఆలోచిస్తోందని, ఈ స్టేడియాన్ని వేరే చోటికి తరలించనున్నట్లుగా తెలిపారు. ఈ ఘటన తనను, ప్రభుత్వాన్ని బాధించిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ కేసులో ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయాన్ని జరుపుకుంటుండగా, ఆ రోజు గుంపు నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదంలో 11 మంది మరణించారు, ఆ తర్వాత ఈ కేసు హైకోర్టుకు చేరింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ విషయంలో హైకోర్టును ఆశ్రయించింది. RCB అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకున్న వ్యక్తులకు మాత్రమే చిన్నస్వామి స్టేడియంలోకి ప్రవేశం ఉంటుందని సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్‌లో స్పష్టంగా సమాచారం ఇచ్చామని పేర్కొంది.