French Open 2025 | ఫ్రెంచ్ ఓపెన్ విజేత కార్లోస్ అల్కరాస్
ఫ్రెంచ్ ఓపెన్‌లో తిరుగులేని ఆటగాడు, స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్ వారసుడు అనిపించుకున్నాడు అదే దేశానికి చెందిన కార్లోస్ అల్కరాస్. ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో ఇటలీకి చెందిన యానిక్ సినర్ పై విజయం సాధించాడు. వరుసగా రెండోసారి మట్టి కోర్టులో తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. రఫెల్ నాదల్, గుస్తానో కుయెర్టన్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్న ఆటగాడిగా అల్కరాస్ నిలిచాడు. వరుసగా రెండు సెట్లు ఓడిపోయి టైటిల్ నెగ్గడం అంటే ఆషామాషీ కాదు. కానీ స్పెయిన్ యువ సంచలనం అల్కరాస్ దాన్ని చేసి చూపించాడు.
అయితే ఈ ఫైనల్ మ్యాచ్ తో 1982లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ రికార్డును బద్దలగొట్టారు. మాట్స్ విలాండర్ 4 గంటల 47 నిమిషాల పాటు పోరాటం చేసి ప్రత్యర్థి గులెర్మో విలాస్‌పై విజయం సాధించాడు. 2025 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ 5 గంటల 29 నిమిషాల పాటు జరిగింది. ఆ రికార్డు 43 ఏళ్లకు అల్కరాజ్, సినర్ బ్రేక్ చేశారు.