Bumrah Funny Conversation with Siraj IPL 2026 | సిరాజ్ ను ఆటపట్టించిన సిరాజ్

ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ గుజరాత్ పై ఘనవిజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ తర్వాత గ్రౌండ్ లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. స్టార్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ మధ్య జరిగిన సరదా కన్వెరేజెషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తెలంగాణ ప్రభుత్వం మహ్మద్ సిరాజ్‌ను డీఎస్పీగా నియమించిన సంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న సిరాజ్, మ్యాచ్ ముగిసిన తర్వాత బుమ్రాను కలిశాడు. ఈ సందర్భంగా బుమ్రా జోక్ చేస్తూ.. "నేను హైదరాబాద్‌ వెళ్ళినప్పుడు బిర్యానీ అడిగితే పంపిస్తాడు కానీ, డీఎస్పీ కారు మాత్రం ఎక్కడా కనిపించదు" అంటూ ఆటపట్టించాడు. 

బుమ్రా చేసిన ఈ కామెంట్స్‌కు సిరాజ్ నవ్వేయగా, అక్కడున్న వారంతా ఎంజాయ్ చేశారు. వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్‌కు ఈ మ్యాచ్‌లో బుమ్రా తన బౌలింగ్‌తో కమ్‌బ్యాక్ ఇచ్చాడు. గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్‌ను తొలి బంతికే అవుట్ చేసి షాక్ ఇచ్చాడు. చాలా రోజుల తర్వాత బుమ్రాకు ఐపీఎల్‌లో వికెట్ దక్కడం విశేషం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola