భారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమం
బోర్డర్- గావస్కర్ టెస్టు సిరీస్ లో భారత్ కు తొలి పరాజయం ఎదురైంది. అడిలైడ్ వేదికగా జరిగిన రెండో డే/నైట్ టెస్టులో భారత్ పది వికెట్ల తేడాతో ఘెర పరాజయం పాలైంది. ఆదివారం మూడోరోజు ఓవర్ నైట్ స్కోరు 128/5తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్.. 175 పరుగులకే కుప్పకూలింది. తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి (47 బంతుల్లో 42, 6 ఫోర్లు, 1 సిక్సర్) మరోసారి 42 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. రెండో ఇన్నింగ్స్ లోనూ భారత బ్యాటర్ల వైఫల్యం కొనసాగింది. 36.5 ఓవర్లలో ఇన్నింగ్స్ ముగిసింది. ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ బాల్ తో జట్టును ముందుండి నడిపించాడు. 57 పరుగులకు ఐదు వికెట్లు తీసుకుని సత్తా చాటాడు. స్కాట్ బోలాండ్ కు మూడు, మిషెల్ స్టార్క్ కి రెండు వికెట్లు దక్కాయి. రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ కు కేవలం 19 పరుగుల స్పల్ప టార్గెట్ ను ఆసీస్ ముందు భారత్ ఉంచింది. 3.2 ఓవర్లలో వికెట్లేమీ కోల్పోకుండా కంగారూలు ఈ టార్గెట్ ను సునాయాసంగా ఛేదించారు.