నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
సౌతాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్‌లో ఏకంగా 101 పరుగుల తేడాతో హిస్టారికల్ విక్టరీ సాధించిన టీమిండియా.. అదే ఊపును రెండో టీ20లో కూడా కంటిన్యూ చేసి మరో మ్యాజికల్ విక్టరీ సాధించాలని పట్టుదలగా కనిపిస్తోంది. నేడు గురువారం ముల్తాన్‌పూర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో సఫారీ టీమ్ కూడా బలంగా కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ లేకపోలేదు. అంతేకాకుండా.. కటక్‌లో జరిగిన ఫస్ట్ టీ20లో బౌలర్ల పుణ్యమా అని భారత్ గెలిచినా.. బ్యాటింగ్‌లో మాత్రం కంప్లీట్‌గా ఫెయిల్ అయింది.
చివర్లో హార్దిక్ పాండ్యా బౌండరీల వర్షం కురిపించి హాఫ్ సెంచరీ బాదకపోయి ఉంటే.. భారత్ స్కోర్ 150 కూడా చేరేది కాదేమో. ఓపెనర్ అభిషేక్ శర్మ నుంచి అక్షర్ పటేల్ వరకు ఒక్కరంటే ఒక్క బ్యాటర్ కూడా తన స్థాయిలో రాణించింది లేదు. ఇక గాయం నుంచి కోలుకుని తిరిగొచ్చిన శుభ్‌మన్ అయితే మరీ దారుణంగా కనీసం రెండంకెల స్కోరు కూడా చేయకుండా 4 పరుగులకే పెవిలియన్ చేరాడు. కెప్టెన్ సూర్యకుమార్ కూడా 12 పరుగులకే అవుటై మరోసారి నిరాశపరిచాడు. మిగిలిన బ్యాటర్లు కూడా ఏదో బ్యాటింగ్ మర్చిపోయినట్లు.. టీ20 మ్యాచ్‌లో వన్డే కంటే దారుణంగా బ్యాటింగ్ చేసి అవుటైపోయారు.
మరి ఈ రోజు జరగబోయే రెండో టీ20లో అయినా బ్యాటింగ్ లోపాలను సరిచేసుకుని అదరగొడతారో లేదో చూడాలి. మిడిల్ ఆర్డర్లో హార్దిక్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు కాబట్టి.. ఓపెనింగ్‌లో అభిషేక్, ఆ తర్వాత తిలక్ రాణిస్తే భారత్ భారీ స్కోరు చేయడం ఖాయం. ఇక మన బౌలర్లు బుమ్రా, అర్షదీప్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ ఆల్రెడీ వికెట్ల వేటలో దూసుకెళ్తున్నారు. ఇది భారత్‌కి కలిసొచ్చే అంశం. అయితే మరోవైపు సౌతాఫ్రికా కూడా తొలి వన్డేలో దారుణ ఓటమికి ఈ మ్యాచ్‌లో రివెంజ్ తీర్చుకోవాలని బలంగా అనుకుంటోంది. ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలిచి 5 టీ20ల సిరీస్‌ని 1-1 తో ఈక్వల్ చేయాలని ప్లానింగ్ చేస్తోంది. ఇదిలా ఉంటే ముల్లాన్‌పుర్‌లోని పీసీఏ స్టేడియంలో ఇంటర్నేషనల్ మ్యాచ్ జరగడం ఇదే ఫస్ట్ టైం. మరి ఈ మ్యాచ్‌లో బోణీకొట్టేదెవరో చూడాలి.