అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

Continues below advertisement

రోకో కంటే బెటర్ గా ఆడే ప్లేయర్స్ ఎవరో చెప్పండి.. ఇది హర్భజన్ సింగ్ ప్రశ్న. రోకోతో పెట్టుకుంటే ఖతమైపోతారు.. ఇది రవి శాస్త్రి వార్నింగ్. అయితే ఆల్రెడీ టీ20, టెస్ట్ ఫార్మాట్‌లకు గుడ్ బై చెప్పిన కోహ్లీ, రోహిత్.. ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కంటిన్యూ అవుతూ.. వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే టార్గెట్ గా పెట్టుకున్న విషయం మనందరికీ తెలుసు. దానికి తగ్గట్టే రీసెంట్ సిరీస్ ల్లో రోకో ఇద్దరూ పరుగుల వరద పారించి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లారు. ఏకంగా రోహిత్ ఫస్ట్ ప్లేస్ కి, కోహ్లీ సెకండ్ ప్లేస్ కి చేరుకున్నారు.

విచిత్రం ఏంటంటే 2019 లో కూడా ICC వన్డే ర్యాంకింగ్స్ లో వీళ్లిద్దరే టాప్ లో ఉన్నారు. అయితే అప్పటికి, ఇప్పటికీ చిన్న తేడా! అప్పుడు కోహ్లీ 1st position లో ఉంటే.. రోహిత్ సెకండ్ ప్లస్ లో ఉన్నాడు. But ఇప్పుడు రోహిత్ 781 పాయింట్స్ తో టాప్ కి చేరుకుంటే కోహ్లీ 773 పాయింట్స్ తో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే.. వన్డే ర్యాంకింగ్స్ లో టాప్ కి చేరుకోవడం రోహిత్ కి కెరీర్లో ఇదే  ఫస్ట్ టైం. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ తర్వాత కెరీర్‌లో తొలిసారి టాప్ ర్యాంక్ అందుకున్న రోహిత్.. అదే స్థానంలో ఉన్నాడు. ఇక సౌతాఫ్రికాతో 3 వన్డేల సిరీస్‌లో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో రాణించిన విరాట్ కోహ్లీ 2 స్థానాలు బెటర్ అయి టాప్-2 ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. ఇక ఈ రేంజ్ performances ఇవ్వడంతో వీళ్ళిద్దరినీ ఎట్టి పరిస్థితుల్లో 2027 వన్డే వరల్డ్ కప్ ఆడించాల్సిందే అంటూ ఫ్యాన్స్ నుంచి ఫుల్ సపోర్ట్ లభిస్తొంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola