Asian Games Accommodation Issue | ఏషియన్ గేమ్స్‌ వివాదంపై జపాన్ క్రికెట్ కామెంట్స్

Continues below advertisement

జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా సెప్టెంబర్ 17 నుంచి ప్రారంభం కానున్న ఏషియన్ గేమ్స్ క్రికెట్ ఈవెంట్ వసతులపై వివాదం నెలకొంది. ఈ మ్యాచ్‌లు జరిగే కొరోగి స్పోర్ట్స్ పార్క్‌కు 20 కిలోమీటర్ల దూరంలో హోటల్ కేటాయించడంపై ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) సమావేశంలో పలు దేశాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. దీనిపై జపాన్ క్రికెట్ అసోసియేషన్ (JCA) సీఈవో నవోకి అలెక్స్ మియాజీ స్పందించారు.

క్రికెట్ జట్ల కోసం సిద్ధం చేసిన హోటల్ వసతులు నచ్చకపోతే, తమ సొంత ఖర్చులతో నచ్చిన చోట స్టే ఏర్పాటు చేసుకోవడానికి జట్లకు పూర్తి స్వేచ్ఛ ఉందని మియాజీ స్పష్టం చేశారు. ఇతర క్రీడల అథ్లెట్లకు క్రూయిజ్ షిప్‌లు, కంటైనర్ హోటళ్లలో వసతి కల్పిస్తే.. క్రికెటర్లకు మాత్రం మెరుగైన హోటల్ సౌకర్యాలు కేటాయించామని చెప్పారు. అలాగే డ్రెస్సింగ్ రూమ్‌లకు దూరంగా వాష్‌రూమ్స్ ఉన్నాయన్న వార్తలను ఖండిస్తూ, ప్లేయర్స్ ఏరియాలోనే అన్ని సౌకర్యాలు ఉన్నాయని వివరణ ఇచ్చారు.

జపాన్‌లో క్రికెట్ మెయిన్ గేమ్ కాకపోయినప్పటికీ, కేవలం 17 నెలల వ్యవధిలోనే శ్రీలంక క్యూరేటర్ల సహకారంతో అత్యుత్తమ టర్ఫ్ పిచ్‌లను సిద్ధం చేశామని తెలిపారు. ఆసియాలోని పెద్ద టీమ్స్ బరిలోకి దిగుతుండటంతో ఈ ఏషియన్ గేమ్స్‌లోనే క్రికెట్ ఈవెంట్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola