IND vs AFG T20s | అఫ్గాన్‌ సిరీస్‌ పై కృనాల్ పాండ్యా పోస్ట్ వైరల్

Continues below advertisement

అఫ్గానిస్తాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం సెలెక్టర్లు భారత జట్టును ప్రకటించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా సెప్టెంబర్ 13 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది.

ఈ జట్టు ఎంపికలో సీనియర్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాకు మరోసారి నిరాశే ఎదురైంది. ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున 226 పరుగులు చేయడంతో పాటు 14 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేసినా సెలెక్టర్లు అతడిని పరిగణనలోకి తీసుకోలేదు. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్‌లకు స్పిన్ బాధ్యతలు అప్పగించారు. దీంతో కృనాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో "హోప్ ఈజ్ స్టిల్ అలైవ్" అని పోస్ట్ చేయగా, అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరోవైపు గాయం నుంచి కోలుకున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు. అయితే బుమ్రాతో పాటు నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాలు పూర్తి ఫిట్‌నెస్ నిరూపించుకుంటేనే తుది జట్టులో ఆడతారని బీసీసీఐ స్పష్టం చేసింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola