Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్

Continues below advertisement

ఇంగ్లాండ్‌తో లార్డ్స్ వేదికగా జరగబోయే ఆఖరి వన్డేనే రోహిత్ శర్మకు చివరి మ్యాచ్ అంటూ వస్తున్న రిటైర్మెంట్ వార్తలపై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. సీనియర్ ఆటగాళ్లతో సెలెక్టర్లు మరియు మేనేజ్‌మెంట్ ప్రవర్తిస్తున్న తీరు సరిగ్గా లేదంటూ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

ఒక ఆటగాడు తనకంటూ ఒక గొప్ప వారసత్వాన్ని నిర్మించుకున్న జట్టులోనే.. తనను ఎవరూ పట్టించుకోవడం లేదనే భావన కలిగించడం కంటే దారుణం మరొకటి ఉండదని అశ్విన్ అన్నాడు.

"ఒకవేళ రోహిత్ అవసరం లేదని భావిస్తే, ఆ విషయాన్ని 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన వెంటనే మొహమాటం లేకుండా చెప్పాల్సింది. మెగా టోర్నీకి కేవలం 12 నెలల ముందు ఇలా పక్కనపెట్టడం ఏంటి? మీరు అంటే ఇష్టం లేని ఇంట్లో మీరు ఉండగలరా?" అంటూ ఘాటుగా ప్రశ్నించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో తనకూ ఇలాంటి చేదు అనుభవమే ఎదురైందని, తన ఉనికి మేనేజ్‌మెంట్‌కు ఇష్టం లేదనే భావన కలిగిందని అశ్విన్ గుర్తుచేసుకున్నాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola