Archer Comments on Vaibhav Suryavanshi | వైభవ్ సూర్యవంశీ పై జోఫ్రా ఆర్చర్ కామెంట్స్

Continues below advertisement

ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై రాజస్థాన్ రాయల్స్ 47 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి, క్వాలిఫయర్-2 లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లతో చెలరేగిన స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్.. మ్యాచ్ తర్వాత యూనివర్సల్ బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీపై ఒక సెన్సేషనల్ కామెంట్ చేశాడు.

వైభవ్ సూర్యవంశీని ఎలా ఔట్ చేయాలి? అని ఆర్చర్‌ని అడగ్గా.. ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. "వైభవ్ బ్యాటింగ్‌కు నేను ఫిదా అయ్యాను. నెట్స్‌లో రోజు అతనితో ప్రాక్టీస్ చేస్తా కాబట్టి అతన్ని ఎలా ఔట్ చేయాలో, అతని బలహీనత ఏంటో నాకు బాగా తెలుసు. కానీ, ఆ సీక్రెట్‌ను నేను ఇప్పుడే చెప్పను. ఈ ఐపీఎల్ సీజన్ మొత్తం ముగిసిన తర్వాతే బయటపెడతా" అంటూ నవ్వేశాడు ఆర్చర్.

నిజానికి వైభవ్ సూర్యవంశీ యార్కర్లకు మాత్రమే కొంచెం ఇబ్బంది పడతాడు. మ్యాచ్ ఆరంభంలో అతనికి బౌండరీలు ఇవ్వకుండా ఒత్తిడి పెంచితే.. రాంగ్ షాట్స్ ఆడి ఔట్ అవుతాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్యాట్ కమిన్స్ యార్కర్లు వేయలేక విఫలమయ్యాడు. దాంతో బౌలర్ల తప్పిదాలను క్యాష్ చేసుకున్న ఈ బుడ్డోడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola