Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే

Continues below advertisement

భారత సీనియర్ క్రికెటర్ అజింక్యా రహానే అంతర్జాతీయ, అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. దాదాపు రెండు దశాబ్దాల క్రికెట్ ప్రయాణానికి ముగింపు పలుకుతూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ వీడియో షేర్ చేశారు. ఈ సందర్భంగా ఎంఎస్ ధోనీ గురించి, తన కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను రహానే వెల్లడించారు.

ధోనీ అత్యంత ప్రశాంతమైన వ్యక్తి అని, ఆయన కెప్టెన్సీలో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. ధోనీకి సంబంధించిన ఒక సీక్రెట్ రూల్ గురించి చెబుతూ "ధోనీ రూమ్ డోర్ తెరిచి ఉన్నంతవరకు టీమ్ మెంబర్స్ అందరూ వెళ్లొచ్చు. కానీ ఒక్కసారి డోర్ క్లోజ్ అయిందంటే, ఎవరికీ ఎంట్రీ ఉండేది కాదు" అని రహానే పేర్కొన్నారు.

రహానే టెస్టు, వన్డే, T20 డెబ్యూలు ధోనీ కెప్టెన్సీలోనే జరిగాయి. అలాగే IPL 2023, 2024 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ డ్రెస్సింగ్ రూమ్‌ను కూడా పంచుకున్నారు. మరో ఆసక్తికర విషయమేంటంటే, సిరీస్ జరుగుతున్న సమయంలో తాను సోషల్ మీడియా యాప్స్ డిలీట్ చేసేవాడినని, 2017లో బెన్ స్టోక్స్ ఇచ్చిన సలహాతో ఈ అలవాటు చేసుకున్నానని తెలిపారు రహానే.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola