Abhishek Sharma IPL 2026 SRH vs DC | అభిషేక్ సెంచరీ సెలబ్రేషన్ వెనక ఉన్న కారణం ఇదే

ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై వీరవిహారం చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ తన సక్సెస్ సీక్రెట్‌ను బయటపెట్టాడు. తన గ్రోత్ కు SRH మేనేజ్‌మెంట్ ఇచ్చిన స్వేచ్ఛే కారణమని అన్నాడు. 

మ్యాచ్ తర్వాత అభిషేక్ మాట్లాడుతూ.. "మా మేనేజ్‌మెంట్ మాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చింది. పంజాబీ ప్లేయర్స్ ఫ్రీడమ్ ఇస్తే ఎలా చెలరేగిపోతారో ఈ రోజు నా ఇన్నింగ్స్ చూస్తే అర్థమవుతుంది. 2024 నుండి టీమ్ లో ఎన్విరాన్మెంట్ మా అందరికీ ఒక గేమ్ ఛేంజర్. కేవలం విజయాల కోసమే కాకుండా, ప్లేయర్స్ ను ప్రోత్సహించాలనే మేనేజ్‌మెంట్ నిర్ణయం మమ్మల్ని స్టార్స్‌గా మార్చింది" అని తెలిపాడు. 

అలాగే నేను అండర్-12 ఆడుతున్నప్పటి నుంచి మా నాన్న స్క్రీన్‌కు దగ్గరగా కూర్చుని నాకు సైగలు చేస్తారు. ఇక్కడ ఉప్పల్‌లో కూడా ఆయన అలాగే కూర్చుని గైడ్ చేశారు. ఈ సెంచరీని మా అమ్మనాన్నలకు, అలాగే ఇన్ఫెక్షన్ వల్ల మ్యాచ్‌కు రాలేకపోయిన మా అక్కకు అంకితమిస్తున్నాను" అని భావోద్వేగానికి లోనయ్యాడు. అభిషేక్ తన ట్రేడ్ మార్క్ L సైగ వెనుక ఉన్న రహస్యాన్ని చెబుతూ.. ఉప్పల్ స్టేడియం, ఫ్యాన్స్ తనకు ఎంతో ప్రత్యేమని, వారిపై ఉన్న ప్రేమను తిరిగి ఇవ్వడానికే అలా సెలబ్రేట్ చేసుకుంటానని తెలిపాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola