Srisailam: కాళరాత్రి అలంకారంలో శ్రీశైల భ్రమరాంబ
Continues below advertisement
శ్రీశైలంలో దసరా మహోత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి. నవదుర్గ అలంకార రూపంలో ఏడోరోజు కాళరాత్రి అలంకార రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చింది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై కాళరాత్రి అలంకార రూపంలో గజవాహనంపై ఉన్న స్వామిఅమ్మవార్లకు ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులు వైభవంగా ఆలయ ప్రాకారోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఉత్సవమూర్తుల ముందు కోలాటాలు బ్యాండ్ వాయిద్యాల నడుమ డప్పు చప్పుల్లు లంబాడీల ఆటపాటలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
Continues below advertisement