Warangal: వరంగల్ లో అన్నపూర్ణేశ్వరీగా భద్రకాళి అమ్మవారు..భారీగా తరలివచ్చిన భక్తులు
దసరా నవరాత్రుల్లో భాగంగా వరంగల్ భద్రకాళీ అమ్మవారు అన్నపూర్ణేశ్వరీగా దర్శనమిస్తున్నారు. ఉదయం నుంచి భద్రకాళి అమ్మవారిని భక్తులు దర్శించుకొని తరిస్తున్నారు. వరంగల్ భద్రకాళి ఆలయంలో వైభవంగా దసరా వేడుకలు జరుగుతున్నాయి. అన్నపూర్ణేశ్వరిని దర్శించుకోవటానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు.