Dhanteras: బంగారానికి, ధనత్రయోదశికి లింకేంటి... ఆరోజే లక్ష్మీ పూజ ఎందుకు చేస్తారంటే!
ABP Desam
Updated at:
02 Nov 2021 03:01 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appధనత్రయోదశి.... దీనినే ధంతేరాస్ అని కూడా పిలుస్తారు. దీపావళికి రెండు రోజుల ముందు వచ్చే ఈ పండుగకు ఎంతో విశిష్టత ఉంది. ప్రత్యేకించి బంగారం... అసలు ధన్ తేరస్ రోజునే బంగారం ఎందుకు కొనుగోలు చేయాలి...? ఆశ్వయుజ బహుళ త్రయోదశినే ధన త్రయోదశిగా జరుపుకుంటారు. ఈ రోజున బంగారం, వెండి ఆభరణాలను పూజలో పెడితే లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని నమ్ముతారు. ఈ రోజున కొందరు బంగారం, వెండి కొనుగోలు చేయడాన్ని సెంటిమెంట్ గా చాలామంది భావిస్తారు. ఈ రోజునే బంగారం ఎందుకు కొనుగోలు చేయాలి.. ఈ సెంటిమెంట్ ఎప్పటి నుంచి ఉంది అన్నదే ఇప్పుడు డిస్కషన్.