Baba Ramdev : తిరుమలలో ఉన్న ఆధ్యాత్మిక శోభ మరెక్కడా చూడలేదు

టిటిడి ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తున్న గో- మహా సమ్మేళనం కార్యక్రమానికి హాజరైన యోగా గురువు రాందేవ్ బాబా... తొలిసారిగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని సందర్శించారు. ప్రపంచంలో ఎన్నో ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించాననీ.. తిరుమలలో ఉన్న ఆధ్యాత్మిక శోభ ఎక్కడా చూడలేదని తెలిపారు. భూలోక వైకుంఠంలో తిరుమలలో శ్రీనివాసుడు ఉన్నట్లు అనిపిస్తోందని చెప్పారు. మనో వికాసం కలిగిందని... ఆలయ వాతావరణం ముక్తిని కలిగించిందని చెప్పారు. గో మాత సంరక్షణలో సీఎం జగన్ పాత్రను కొనియాడిన ఆయన... జగన్ కు తన ఆశీస్సులు ఉంటాయని చెప్పారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola