Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్

తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలలో కీలక నేతల మధ్య బూతుల విమర్శలు తారాస్దాయికి చేరాయి. వినలేని మాటలు, చెప్పలేని పదాలతో ఒకరిపై ఒకరు రెచ్చిపోతున్నారు. క్రిందస్దాయి కేడర్ కూడా మాట్లడని బూతులతో కీలక నేతలు హద్దుమీరుతున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ , మాజీ మంత్రి కేటీఆర్ సైతం గతంలో ఎన్నడూ లేనంతలా దిగజారుడు రాజకీయాలకు దిగుతున్నారంటూ సోషల్ మీడియా వేదికపై విమర్శులు వెల్లువెత్తుతున్నాయి.  కేటీఆర్ కరీంనగర్ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్‌ తీవ్రంగా స్పందించడం.. దీనికి బీఆర్‌ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి అంతకంటే తీవ్రంగా రియాక్ట్ అవ్వడంతో రచ్చ లేచింది. పాడి కౌశిక్‌ రెడ్డిపై బీజేపీ కార్యకర్తలు దాడికి వెళ్లారు. మాజీమంత్రి గంగుల కమలాకర్ ఇంట్లోే మీడియా సమావేశం జరగుతుండగానే ఆయనపైకి దూసుకెళ్లారు. కొన్నాళ్లుగా రాజకీయ నాయకుల భాష బాగా దిగజారింది. ఏమాత్రం కంట్రోల్ లేకుండా మాట్లాడుతుండటంతో ప్రజల్లో తీవ్ర అసహనం రేగుతోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చను ఈ వీడియోలో చూడండి. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola