Zimbabwe Cricketer Match Fixing: జింబాబ్వే స్టార్ ఆటగాడిపై ఐసీసీ వేటు!

అంతర్జాతీయ క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ వ్య‌వ‌హారం మ‌రోసారి క‌ల‌క‌లం సృష్టించింది. 2019 లో ఓ భారత వ్యాపారవేత్త, తనను మ్యాచ్ ఫిక్సింగ్ చేయమని బెదిరించాడని సోష‌ల్ మీడియా లో పేర్కొన్నాడు టేల‌ర్‌. ఆర్ధిక సమస్యల కారణంగా ఆ వ్యక్తి నుంచి కొంత నగదును కూడా తాను తీసుకున్నట్లు అంగీకరించాడు టేల‌ర్‌. కానీ క్రికెట్ మ్యాచ్లను తాను ఎప్పుడూ ఫిక్స్ చేయలేదని తెలిపాడు బ్రెండన్ టేలర్. గతం లో యాంటీ డోపింగ్ నేరానికి కూడా పాల్పడ్డాడు బ్రెండన్ టేలర్. ఈ వ్యవహారం పై స్పందించిన ఐసీసీ టేలర్ పై అంతర్జాతీయ క్రికెట్ నుంచి మూడున్నర సంవత్సరాలు బ్యాన్ విధిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. గత ఏడాది క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన టేలర్ జింబాబ్వే తరపున 205 వ‌న్డేలు, 34 టెస్టులు, 45 టీ20లు ఆడాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola