YS JAGAN: తూర్పుగోదావరి జిల్లా రోడ్లపై వైరల్ అవుతున్న జగన్ ఫ్లెక్సీలు
తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ జగన్ ఫ్లెక్సీలు వైరల్ అవుతున్నాయి. అనపర్తి కెనాల్ రోడ్డులో మరమ్మతులు చేయాలంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన గుర్తు తెలియని వ్యక్తులు.....వాటిపై జగన్ అన్న ఉన్నాడు. జాగ్రత్త అంటూ వ్యాఖ్యలు రాశారు. అనపర్తి-బలభద్రపురం మధ్య ఈ ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. రోడ్డు వేసేవరకూ ఫ్లెక్సీ తీయకూడదంటూ దానిపై వ్యాఖ్యలు ఉన్నాయి.