బెంగుళూరు ఆర్మీ బేస్ నుంచి చిత్తూరు జిల్లాకు లాన్స్ నాయక్ సాయితేజ భౌతికకాయం
Continues below advertisement
ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చేందినా లాన్స్ నాయక్ సాయితేజ అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో ఇవాళ నిర్వహించనున్నారు.. సాయితేజ పార్ధివదేహం ఉదయం ఐదు గంటలకు బెంగళూరులోని ఎలహంక ఆర్మీ బేస్ నుంచి రోడ్డు మార్గం ద్వారా చిత్తూరు జిల్లాకు చేరుకుంది.. పుంగనూరు రోడ్డు మార్గం గుండా ఆయన స్వగ్రామంమైన ఎగువరేగడకు ర్యాలీగా చేరుకుంటుంది.స్నేహితులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పుంగనూరు మార్గం వద్దకు చేరుకుని అక్కడ నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల సందర్శనార్ధం ఉంచి మధ్యాహ్నం 12 గంటలకు ఎగువరేగడి గ్రామంలో సాయితేజ అంత్యక్రియలు నిర్వహిస్తారు.మరోవైపు సాయితేజ నివాసం వద్ద అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సైనిక లాంఛనాలతో సాయితేజకు కడసారి తుది వీడ్కోలు పలికేందుకు ఇండియన్ ఆర్మీ అధికారులు గ్రామానికి చేరుకున్నారు.
Continues below advertisement