YS Jagan Delhi Tour: సోమవారం ప్రధాని మోదీని కలిసేందుకు వెళ్లనున్న ఆంధ్రా సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు దిల్లీ వెళ్లి మోదీ, అమిత్ షాను కలవనున్నారు. ఏపీలోని ఆర్థిక సమస్యలు, తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు, విభజన హామీలతో పాటు మరికొన్ని కీలకాంశాల గురించి చర్చించనున్నారు. కేంద్రం నుంచి రుణపరిమితి సడలింపుల కోసం మంత్రులు ప్రయత్నించినా అనుమతి దక్కకపోగా... ఇప్పుడు సీఎం దిల్లీ పర్యటనపై ఆశలు పెరిగాయి.