Delimitation Issue: జమ్ముకశ్మీర్ లో ఆందోళనలకు దారితీస్తోన్న డీలిమిటేషన్ వ్యవహారం
జమ్ము కశ్మీర్ లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన-డీలిమిటేషన్ పై నియమిత కమిషన్ ఇచ్చిన ప్రతిపాదనలపై ఆ రాష్ట్రంలో ఆందోళన వ్యక్తమవుతోంది. కమిషన్ ఇచ్చిన సిఫారసులు బీజేపీ కి మేలు చేసే విధంగా ఉన్నాయంటూ ప్రతిపక్షాలు ఆందోళన బాట పట్టాయి. అంతే కాదు ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలనే డిమాండ్ ను వినిపిస్తూ రోడ్లపై నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనలు శనివారం తీవ్రస్థాయికి వెళ్లటంతో....ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులను పోలీసులు గృహనిర్భందం చేశారు. ఫరూఖ్ అబ్దుల్లా, ఆయన తనయుడు మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీలను హౌస్ అరెస్ట్ చేశారు. వారి నివాసం బయట భద్రతా ట్రక్కులను మొహరించిన పోలీసులు..సైన్యం హింసాత్మక ఘటనలు చెలరేగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే ఈ చర్యలను మాజీ ముఖ్యమంత్రులు ఖండిస్తూ ట్వీట్లు చేశారు. ఆర్టికల్ 370 పునరుద్ధరణ ప్రధాన పార్టీలన్నీ గుప్కర్ కమిటీగా ఏర్పడి తమ డిమాండ్ల సాధన కోసం పనిచేస్తున్న సంగతి తెలిసిందే.