Nellore Children Park: నెల్లూరులో కొవిడ్ నిబంధనలను గాలికి...అధికారుల సమక్షంలోనే భారీ వేడుకలు

నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ లో శనివారం రాత్రి నిర్వహించిన ఆర్కెస్ట్రాలో అధికారులు నిబంధనలు గాలికొదిలేశారు. ఆర్కెస్ట్రా నిర్వహించేందుకు నెల్లూరు నగర కమిషనర్ అనుమతులు ఇవ్వడమే మొదటి తప్పు. అక్కడ కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా వందలాది మంది ప్రేక్షకులు ఆర్కెస్ట్రా ను చూసేందుకు ఎగబడ్డారు. కనీసం మాస్కులు, శానిటైజర్ వంటి చర్యలు లేకుండా ఆర్కెస్ట్రాను నిర్వహించారు. పిల్లలు, పెద్దలు సైతం మాస్కులు లేకుండా వినోదంలో మునిగిపోయారు. ప్రస్తుతం ఓ మైక్రాన్ కరోనా వేరియెంట్ కారణంగా విందులు వినోదాలు బహిరంగ సభలకు అనుమతులు నిరాకరిస్తూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నప్పటికీ అవేమి నెల్లూరు అధికారులకు పట్టనట్లు వ్యవహరించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola