Veg Crane: శ్రీకాకుళం జిల్లా ఉర్లామ్ పరిసర ప్రాంతాల్లో భిన్నంగా కొంగలు
Continues below advertisement
పచ్చని తివాచీకి తెల్లటి రంగులద్దినట్లుగా ..పొలాల్లో కేరింతలు కొడతాయి కొంగలు. అవును..కానీ కొంగలు ఏం తింటాయో అని ఎప్పుడైనా ఆలోచించారా. ఇంకేముంది నదీపరివాహక ప్రాంతాల్లో చేపలే ఆహారంగా బతుకుతాయి అంటారా?కానీ శ్రీకాకుళం జిల్లాలో కాదు. కొంగలకి ఆకలేస్తే చేపలు భయపడట్లేదు ఇక్కడ. ఎందుకంటే ఉర్లామ్ లో కొంగలు ధాన్యపుగింజల్ని తింటూ గడిపేస్తున్నాయి. చేపలు, పురుగుల్ని తినడం మానేసి ధాన్యం తినడం వింతగా ఉందంటున్నారు స్థానికులు.
Continues below advertisement