YCP Leaders on Teachers: స్కూళ్లకు రాని టీచర్లు మాకెందుకు?
గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం పెదమక్కెన జడ్పీ ఉన్నత పాఠశాల ఎదుట వైసీపీ నాయకులు ధర్నా చేశారు. సమయానికి స్కూళ్లకు రాని టీచర్లు, 100 శాతం రిజల్ట్స్ తీసుకురాలేని వారు మాకొద్దు అంటూ నినాదాలు చేశారు. స్కూల్ గేట్ తలుపులేసి ఆందోళనకు దిగారు. లక్షల్లో జీతాలు తీసుకుంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తూ, పాటలు పాడుతున్నారని, వారు మాకొద్దంటూ ఆందోళన చేశారు. కాసేపటికి ఎమ్మెల్యే అంబటి రాంబాబు జోక్యంతో విరమించారు.